ఎల్పీజీ ఎఫెక్ట్‌... బెంగళూరులో హోటళ్లు బంద్‌ | Bengaluru hotel body warns of citywide hotel shutdown from March 10 due to LPG shortage | Sakshi
Sakshi News home page

ఎల్పీజీ ఎఫెక్ట్‌... బెంగళూరులో హోటళ్లు బంద్‌

Mar 10 2026 3:40 AM | Updated on Mar 10 2026 7:18 AM

Bengaluru hotel body warns of citywide hotel shutdown from March 10 due to LPG shortage

నేటినుంచే అమల్లోకి ∙చెన్నైలోనూ ఇదే పరిస్థితి? 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్‌ తగిలింది. కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్‌ అసోసియేషన్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.

అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement