ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి  | India moves to secure cooking gas stock as West Asia crisis hits supplies | Sakshi
Sakshi News home page

ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి 

Mar 7 2026 5:25 AM | Updated on Mar 7 2026 5:25 AM

India moves to secure cooking gas stock as West Asia crisis hits supplies

చమురు శుద్ధి కంపెనీలకు కేంద్రం ఆదేశం  

న్యూఢిల్లీ: పశి్చమాసియాలో సంక్షోభం నేపథ్యలో దేశీయంగా వంట గ్యాస్‌ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. పెట్రోకెమికల్స్‌ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్‌ ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వాటితో కేవలం ఎల్పీజీని మాత్రమే ఉత్పత్తి చేయాలని తేల్చిచెప్పింది. 

ఎల్పీజీని దేశీయంగా వంట అవసరాలకు మాత్రమే వాడుకోవాలని వెల్లడించిది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.  2024–25లో దేశంలో 31.3 మిలియన్‌ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్‌ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా, మిగతా గ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు 90 శాతం ఎల్పీజీ గల్ఫ్‌ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇరాన్‌ సహా పశి్చమాసియాలో యుద్ధం కారణంగా చమురు సహా ఎల్పీజీ దిగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement