మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం | Karnataka Government Removes Price Control On Alcohol From April 2026, Liquor Companies Can Set Their Own Rates | Sakshi
Sakshi News home page

మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

Mar 6 2026 9:30 PM | Updated on Mar 7 2026 1:27 PM

Karnataka end alcohol price controls from April 2026

బెంగళూరు: మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  మద్యం పాలసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి మద్యం ధరలపై ప్రభుత్వ  నియంత్రణను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల నిర్ణయాన్ని లిక్కర్‌ కంపెనీలే నిర్ణయించేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు  2026-27 బడ్జెట్‌లో మద్యం పాలసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కారు. 

ఏప్రిల్1 వ తేదీ నుండి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి,  లిక్కర్‌ కంపెనీలే ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. ఆరు దశాబ్దాల నుంచి ఉన్న మద్యం ధరల నియంత్రణను ప్రభుత్వం తొలగించింది. 

దీంతో డిస్టిలరీలు మరియు బ్రూవరీస్ తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించుకోవచ్చు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది.   మరొకవైపు ఆల్కహాల్‌ శాతం ఆధారంగా ఎక్సైజ్‌ సుంకం ఉండనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరగడమే కాకుండా, పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement