T20 WC Final: అదృష్టం!.. భయపెడుతున్న మరో సెంటిమెంట్‌ | T20 WC 2026 Final: India Loss Toss To New Zealand Fans Worries Even Luck | Sakshi
Sakshi News home page

T20 WC Final: అదృష్టం!.. భయపెడుతున్న మరో సెంటిమెంట్‌

Mar 8 2026 7:11 PM | Updated on Mar 8 2026 7:44 PM

T20 WC 2026 Final: India Loss Toss To New Zealand Fans Worries Even Luck

న్యూజిలాండ్‌తో టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఊహాగానాలకు తెరదించుతూ సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టునే టైటిల్‌ పోరులోనూ కొనసాగించింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ.. నంబర్‌ వన్‌ బౌలర్‌ వరుణు చక్రవర్తికి తుదిజట్టులో చోటు ఇచ్చింది.

అదే వేదిక.. అదే అంపైర్‌
ఇదిలా ఉంటే.. భారత్‌- కివీస్‌ జట్లకు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఇదే వేదికపై టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌.. తాజా ఫైనల్‌కు కూడా అంపైర్‌ కావడం గమనార్హం.

అదృష్టం ఏమిటంటే
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడిపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 14 టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో పదకొండు లక్ష్య ఛేదనకు దిగిన జట్లే గెలవడం ఇందుకు కారణం. అయితే, అదృష్టం ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచిన సందర్భాలలో.. మూడు విజయాలూ టీమిండియా ఖాతాలోనే ఉండటం. 

కాగా టీమిండియా కివీస్‌తో ఫైనల్‌లో ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్‌ కోల్‌ మెకాంచీ స్థానంలో జేకబ్‌ డఫీని తీసుకువచ్చింది.

 

తుదిజట్లు
భారత్‌
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

 

న్యూజిలాండ్‌
టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ .

Advertisement
 
Advertisement
Advertisement