‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’ | If Sanju had not become part of XI: IND Ex Star massive remark | Sakshi
Sakshi News home page

‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’

Mar 9 2026 2:18 PM | Updated on Mar 9 2026 3:56 PM

If Sanju had not become part of XI: IND Ex Star massive remark

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. అహ్మదాబాద్‌లో కివీస్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్పాన్‌ పఠాన్‌ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్‌ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ..

తుదిజట్టులో లేకపోయి ఉంటే..
‘‘ఈ ‍ప్రపంచకప్‌ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్‌ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్‌తో సూపర్‌-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్‌ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్‌ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.

అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్‌వర్క్‌కు లభించిన స్వీటెస్ట్‌ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.

నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపం
కాగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ ఆడాడు.

అయితే, నాకౌట్‌ మ్యాచ్‌లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. 

చదవండి: సంజూ, ఇషాన్‌ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్‌ మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement