టీ20 వరల్డ్‌కప్-2026 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత్ మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ తుది పోరులో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్రీడా స్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడు. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్‌తో అర్ష్‌దీప్ గొడవపడ్డాడు.
అసలేమి జరిగిందంటే?
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులను మిచెల్ భారీ సిక్సర్లగా మలిచాడు. అదే ఓవర్‌లో ఐదో బంతికి నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు మిచెల్ ఆడాడు. అయితే ఫాలో త్రులో బంతిని అందుకున్న అర్ష్‌దీప్ కోపంతో వికెట్ల వైపు త్రో చేశాడు.
అయితే బంతి నేరుగా వెళ్లి మిచెల్‌కు బలంగా తాకింది. క్రీజులో ఉన్నప్పటికి తనపైకి బంతి విసిరడంతో మిచెల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. అర్ష్‌దీప్ వైపు కోపంగా చూస్తూ, గట్టిగా అరుస్తూ అతని వైపు వెళ్లాడు. ఆ సమయంలో అర్ష్‌దీప్ మొదట క్షమాపణ చెప్పకుండా వెనక్కి నడవడంతో మిచెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్‌కు సర్దిచెప్పాడు. అంపైర్ కూడా అర్ష్‌దీప్‌ను పిలిచి హెచ్చరించాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్‌దీప్ స్వయంగా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది.
కానీ అర్ష్‌దీప్ ప్రవర్తనను భారత అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. సారి చెప్పినా, అర్ష్‌దీప్ అలా చేయడం సరికాదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన 4 ఓవర్లలో కోటాలో32 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
చదవండి: T20 WC 2026: టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
Rohit Sharma to Arshdeep Singh regarding Daryl Mitchell incident🎙;
Paaji !! Since when do you start doing so much sledging😭❤🔥
pic.twitter.com/5l49estQO4— Gillfied⁷ (@Gill_Iss) March 8, 2026


