టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్‌లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్‌లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్‌గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది.
ప్రశంసల వర్షం
ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.
‘‘పాకిస్తాన్‌లో క్రికెట్ టాలెంట్‌కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.
అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?
అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.
క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్‌లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.
అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్‌లలో పెద్ద జట్లను ఓడిస్తుంది.
ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం
కానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్‌ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు.
చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్
Pressure? WHAT PRESSURE!? 💪
Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍
🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:
👉 Virat Kohli | 2014
👉 Sanju Samson | 2026
ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026


