ఈ రోజుల్లో మహా సంపద...మనశ్శాంతి. ‘కోట్ల సంపద ఉంది. మనశ్శాంతి లేదు’ అనేవారు ఉన్నారు. ‘చిల్లిగవ్వ లేదు...ఎంతో మనశ్శాంతి ఉంది’ అనేవారు ఉన్నారు. మనశ్శాంతి అనేది డబ్బు, హోదాతో కొలవలేనిది. అరుదైన మనశ్శాంతి సొంతం చేసుకోవడానికి దగ్గరికి దారి...ధ్యానం....
ఈ సంవత్సరానికి సంబంధించి ఉత్తేజకరమైన ధ్యాన ధోరణులలో ఒకటి....మెడిటేషన్ అప్లికేషన్‌లలో కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడం. ఈ అధునాతన యాప్‌లు వ్యక్తి గతీకరించిన ధ్యాన అనుభవాలను అందిస్తున్నాయి. మానసిక ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరైన ధ్యాన అభ్యాసాలను కనుగొనడాన్ని సులభతరం చేశాయి.
ఆధునిక ధ్యానపద్ధతులలో వర్చువల్ రియాలిటీ(వీఆర్) కీలకపాత్ర పోషిస్తోంది. బయోమెట్రిక్ సెన్సర్‌లకు సంబంధించి వేరబుల్ టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా మారింది. ధ్యాన సమయంలో ఒత్తిడి స్థాయిలు, హార్ట్ రేట్‌ను పర్యవేక్షించడంలో ఈ సాంకేతికత అభ్యాసకులకు ఉపయోగ పడుతుంది.
ధ్యానానికి ఉపకరించే సాంకేతికత వల్ల అభ్యాసకుల సంఖ్య పెరుగుతోంది. ధ్యానప్రక్రియను సులభతరం చేస్తోంది. సమూహ ధ్యానాలు పెరగడం అనేది సంవత్సరం ట్రెండ్‌లలో ఒకటి. సామూహిక ధ్యానాల వల్ల ధ్యాననప్రక్రియ మరింత ఆనందకరంగా, ప్రయోజనకరంగా మారుతుంది అంటారు విశ్లేషకులు. మెడిటేషన్ యాప్స్ వర్చువల్ గ్రూప్ సెషన్‌లకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాధకులను ధ్యానం అనే దారంతో ఒక దగ్గర చేరుస్తున్నాయి. తమ ధ్యాన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి ఈ గ్రూప్ సెషన్‌లు ఉపయోగపడుతున్నాయి.
లేటెస్ట్ మెడిటేషన్ ట్రెండ్స్‌లో ఒకటి...పర్సనలైజ్‌డ్ మెడిటేషన్. వ్యక్తిగత అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా వ్యక్తిగతీకరించిన ధ్యాన అభ్యాసాలే.. పర్సనలైజ్‌డ్ మెడిటేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన యాప్‌లు అభ్యాసకుల మానసిక స్థితి, శారీరక ప్రతిస్పందనల ఆధారంగా ధ్యానప్రక్రియకు రూపకల్పన చేస్తున్నాయి.
స్వీయ సంరక్షణ, మానసిక ఆరోగ్యాన్ని నొక్కి చెప్పే సాంస్కృతిక ఉద్యమాలు సాంకేతికతను, సంప్రదాయ ధ్యాన అభ్యాసాలతో అనుసంధానిస్తున్నాయి. గైడెడ్ సెషన్‌లను అందించే మొబైల్ యాప్‌లు పెరుగు తున్నాయి.
ఇదీ చదవండి: టీవీ డిబేట్‌లో రామ్‌దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో


