ఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌దేవ్ లైవ్ డిబేట్‌లో సహనాన్ని కోల్పోయారు. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై పిడిగుద్దులు కురిపించారు. అమర్ ఉజాలా లైవ్ డిబేట్ సందర్భంగా గందరగోళం జరిగింది. ఇది కాస్తా ముదిరి శారీరక ఘర్షణగా మారిపోయింది. రామ్‌దేవ్ తోటి ప్యానలిస్ట్‌పై దాడికి దిగారు. అవతలి వ్యక్తి దానిని ప్రతిఘటించి రామ్‌దేవ్‌ను స్టూడియో ఫ్లోర్‌పై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హర్యానాలో ఇది ఫ్యామస్ అంటూ కొన్ని వ్యాయామాలు చేశారు రామ్‌దేవ్. ఆ తరువాత ఛాలెంజ్ అంటూ తోటి ప్యానలిస్ట్‌పై లంఘించారు. ఇలా కొద్ది క్షణాలు సాగిన తరువాత ఇది జోక్‌గానే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అతనికి శక్తిలేదు ఒప్పుకున్నాడు... అతనికోసం చప్పట్లు అంటూ అక్కడున్నవారిని ఉత్సాహపరచడంతో ఈ వివాదం సద్దు మణిగినట్టు అయింది. కాగా టెలివిజన్ చర్చల సమయంలో ఇలాంటి వింత ప్రవర్తనలతో రామ్‌దేవ్ ఆకర్షించడం ఇదే మొదటిసారి కాదు.
దీనిపై నెటిజన్లు విభిన్నంగా కమెంట్ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. వార్తా వేదికలు "కుస్తీ వేదికలు"గా మారాయని అనేక మంది వినియోగదారులు వ్యాఖ్యానించగా, ఛానెల్స్ చర్చల పేరుతో, "TRPల కోసం వివాదాలు సృష్టిస్తున్నాయని మరికొందరు ఆరోపించారు.
Leaving this here. pic.twitter.com/jyIilfWHkz
— Piyush Rai (@Benarasiyaa) December 20, 2025


