సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండిగో ఎంక్వైరీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రయత్నించారు. కస్టమర్ సర్వీస్ రూమ్ డోర్లు బాదుతూ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం.. స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్షన్ వాతావరణ నెలకొనడంతో సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు రంగ్ర ప్రవేశం చేశారు. పోలీసులు, ప్రయాణికులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

ఇండిగో యాజమాన్యం కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ ప్రయాణికుల ఆందోళనకు దిగారు. బోర్డింగ్ పాస్ పూర్తయిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటూ మండిపడ్డారు. తమ లగేజ్ అడిగితే ఇక్కడ ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో కస్టమర్ సర్వీస్ కనీస స్పందన లేదని.. గంటలు గంటలు నిల్చున్న సమాధానం చెప్పట్లేదని.. చిన్నారులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.


