ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ సంక్షోభానికి ‘గుత్తాధిపత్య మోడల్’ ఫలితమంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్‌గా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
విమానాల ఆలస్యం, కాన్సిలేషన్ వల్ల బాధపడేది సామాన్యులేనంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చర్యలు కారణంగా సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలి. న్యాయమైన పోటీ ఉండాలన్న రాహల్... మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కిందటి ఏడాది ఆయన చేసిన ఓ ట్వీట్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు.
IndiGo fiasco is the cost of this Govt’s monopoly model.
Once again, it’s ordinary Indians who pay the price - in delays, cancellations and helplessness.
India deserves fair competition in every sector, not match-fixing monopolies. https://t.co/sRoigepFgv— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2025
దేశవ్యాప్తంగా ఇండిగో కష్టాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 220పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయాల్లో ఒకే రోజు 70కి పైగా విమానాలు రద్దు అయ్యాయి.


