వింత ప్రవర్తన: రేబిస్‌తో కుక్కలా అరుస్తున్న యువకుడు | A 17 year old boy from Mirzapur is now barking and acting like a dog | Sakshi
Sakshi News home page

వింత ప్రవర్తన: రేబిస్‌తో కుక్కలా అరుస్తున్న యువకుడు

Mar 16 2026 1:07 PM | Updated on Mar 16 2026 1:21 PM

A 17 year old boy from Mirzapur is now barking and acting like a dog

లక్నో: ఓ 17ఏళ్ల యువకుడు అచ్చం కుక్కలా ప్రవర్తిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోని కచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

బాలుడి తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు.. కుక్క కరవడం వల్లే తమ కుమారుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరవడం వల్ల రేబిస్‌ వ్యాధి సోకుతుంది. రేబిస్‌కు సరైన వైద్యం అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ బాలుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే అంశంపై వైద్యులు ఆరా తీశారు. రేబిస్‌కు సరైనా చికిత్స తీసుకోకపోవడం వల్లే బాలుడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు గుర్తించారు. 

నాలుగు నెలల క్రితం, ఆ గ్రామంలో నివసించే భాయ్ లాల్ అనే 17 ఏళ్ల యువకుడికి కుక్క కరిచింది. ఈ సమయంలో, అతనికి మొదటి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. రేబిస్‌ సోకితే ఐదు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ బాధిత బాలుడు రెండు టీకాలు మాత్రమే తీసుకున్నాడు. పూర్తి స్థాయిలో వైద్యం తీసుకోకుండా మధ్యలో వదిలేయడం వల్ల  కొంత కాలంగా బాలుడు కుక్కలా ప్రవర్తించడం ప్రారంభించాడు. వైద్య చికిత్స కోసం ఆస్పత్రులు తిరిగినా ఫలితం కనిపించడం లేదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైద్యం అందిస్తే తగ్గిపోతుందని బాలుడి కుటుంబ సభ్యులు తమని తాము సర్ధిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైద్యులు మాత్రం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెప్పారు. 

మరోవైపు,స్థానిక వైద్యులు సైతం బాలుడికి టీకా పూర్తిస్థాయిలో వేయలేదని చెబుతున్నారు. కాబట్టే బాలుడు మాట్లాడే విధానం, నడక, కూర్చునే తీరు మారిపోయింది. అంతేకాకుండా, అతను బతికే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు. బాలుడి పరిస్థితిని వైద్య పరిభాషలో హైడ్రోఫోబియా అని డికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పంకజ్ పాండే వివరించారు. రేబిస్ లక్షణాలు కనిపించినప్పుడు, శ్వాసకోశ మార్గం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా వ్యక్తి కుక్కలా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు’ అని తెలిపారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement