సాక్షి, హైదరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డుల సభ్యుల వివరాలను గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 సర్పంచ్‌లు పోటీ లేకుండా ఎన్నిక కాగా, ఆ తర్వాత జాబితాలో వరుసగా... ఆదిలాబాద్ జిల్లాలో 166 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా 33 చోట్ల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 184 స్థానాలకు 29, నల్లగొండ జిల్లాలో 318 స్థానాలకు 22, యాదాద్రి భువనగిరి జిల్లాలో 153 సర్పంచ్‌లకు 16, సిద్దిపేటలో 163 స్థానాలు 16, నిర్మల్‌లో 136 స్థానాలకు 16, మెదక్ జిల్లాలో 160 స్థానాలకు 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు 15, భద్రాద్రి కొత్తగూడెంలో 159 స్థానాలకు 14, నాగర్ కర్నూల్‌లో 151 స్థానాలకు 14, నారాయణపేట జిల్లాలో 67 పంచాయతీలకు 14, వరంగల్ జిల్లాలో 91 స్థానాలకు 11, కామారెడ్డిలో 167 స్థానాలకు 11, జనగామలో 110 స్థానాలకు 10 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.
రాజన్న సిరిసిల్లలో 85 సర్పంచ్‌లకు 9, ములుగు జిల్లాలో 48 స్థానాలకు 9, మహబూబాబాద్‌లో 155 స్థానాలకు 9, జయశంకర్ భూపాలపల్లిలో 82 స్థానాలకు 9, సంగారెడ్డి జిల్లాలో 136 స్థానాలకు 7, సూర్యాపేట జిల్లాలో 159 సర్పంచ్‌లకు 7, కొమురంభీం జిల్లాలో 114 స్థానాలకు 7, మంచిర్యాల జిల్లాలో 90 స్థానాలకు 6, రంగారెడ్డి జిల్లాలో 174 స్థానాలకు 6చోట్ల, వనపర్తిలో 87 సర్పంచ్‌లకు 5, హనుమకొండ జిల్లాలో 69 స్థానాలకు 4, జగిత్యాలలో 122 స్థానాలకు 4, పెద్దపల్లిలో 99 స్థానాలకు 4, కరీంనగర్ జిల్లాలో 92 సర్పంచ్‌లకు 3 స్థానాల్లో పోటీలేకుండా ఎన్నికయ్యారు.
ఏకగ్రీవ వార్డులు ఇలా...
ఆదిలాబాద్‌లో అత్యధికంగా 953 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 652 మంది పోటీ లేకుండా గెలిచారు. ఇక వరుసగా చూస్తే... నిజామాబాద్ జిల్లాలో 1,642 వార్డులకు 575, నిర్మల్ జిల్లాలో 1,072 వార్డులకు 471 మంది, కామారెడ్డిలో 1,520 వార్డులకు 433 మంది, నల్లగొండ జిల్లాలో 2,870 వార్డుసభ్యులకు 375 మంది, జగిత్యాల జిల్లాలో 1,172 వార్డులకు 349, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,436 వార్డులకు 336, మెదక్‌లో 1,402 వార్డులకు 332 మంది చోట్ల పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 323 మంది, కరీంనగర్ జిల్లాలో 866 స్థానాలకు 276, మంచిర్యాలలో 816 వార్డులకు 268, మహబూబాబాద్‌లో 1,338 స్థానాలకు 266, మహబూబ్‌నగర్ జిల్లాలో 1,188 వార్డులకు 264, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,286 వార్డులకు 243, జనగామలో 1,024 వార్డులకు 228, రాజన్న సిరిసిల్లలో 748 వార్డులకు 227, సిద్దిపేట జిల్లాలో 1,432 వార్డులకు గాను 224, వరంగల్‌లో 800 స్థానాలకు 215 చోట్ల, పెద్దపల్లి జిల్లాలో 896 వార్డులకు 211 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చదవండి: మూడు తరాల సర్పంచ్‌లు
నారాయణపేట జిల్లాలో 572 వార్డులకు 210, నాగర్‌కర్నూల్‌లో 1326 వార్డులకు 208, సూర్యాపేటలో 1,442 వార్డులకు 198, రంగారెడ్డిలో 1530 వార్డులకు 190, హనుమకొండ జిల్లాలో 658 వార్డులకు 153, జయశంకర్ భూపాలపల్లిలో 712 స్థానాలకు 151, ములుగులో 420 వార్డులకు 128, సంగారెడ్డి జిల్లాలో 1,246 వార్డులకు 113, వనపర్తి జిల్లాలో 780 వార్డులకు 104, జోగుళాంబ గద్వాలలో 974 వార్డులకు 79 చోట్ల పోటీ లేకుండా ఎన్నికయ్యారు.
ఉపసర్పంచ్ ఎన్నికకు...
ఏదైనా గ్రామపంచాయతీలోని వార్డులన్నీ ఏకగ్రీవమైన పక్షంలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజునే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, ఎంపీడీఓలకు ఎస్ ఈసీ సూచించింది. దీనికి సంబంధించి ముందుగా జిల్లా కలెక్టర్ల నుంచి ‘నిరభ్యంతర సర్టిఫికెట్’ తీసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయాలని తెలిపింది. కొన్ని గ్రామపంచాయతీల్లో ఒకటి, రెండు వార్డుల్లోనూ ఎన్నికలు జరగాల్సి ఉంటే, ఆ ఎన్నిక పూర్తయ్యాక ఓట్లు లెక్కించాక ఉప సర్పంచ్ ఎన్నికను చేపట్టాలని పేర్కొంది.


