సైబర్ ఉచ్చులో పడొద్దు
గీసుకొండ : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని ఇన్‌స్పెక్టర్ డి.విశ్వేశ్వర్ ఆకాంక్షించారు. మండలంలోని కొనాయిమాకులలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలలో గురువారం నిర్వహించిన అవగాహ సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనవసర, అపరిచిత వ్యక్తుల సందేశాలకు స్పందించొద్దని సూచించారు. సైబర్ మోసా ల బారిన పడితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫోన్ చేయాలని కోరారు. విద్యార్థులు తల్లిదండ్రులను, బంధువులను చైతన్యవంతం చేయాలని తెలిపారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శోభాదేవి, తదితరులు పాల్గొన్నారు.


