మెరుగైన వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలందించాలి

Dec 5 2025 6:58 AM | Updated on Dec 5 2025 6:58 AM

మెరుగ

మెరుగైన వైద్య సేవలందించాలి

నెక్కొండ: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేలా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. షెడ్యూల్‌ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు 100 శాతం ఉండాలని, అసంక్రమిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీసీఏ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పలు రికార్డులు పరిశీలించారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు రహేలా తన్వీర్‌, సుమన్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి

రెజ్లింగ్‌ పోటీలకు సహస్ర

దుగ్గొండి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న యాదగిరి సహస్ర జాతీయస్థాయి రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ అయిలయ్య తెలిపారు. ఈనెల 1 నుంచి 3 వరకు కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్‌ పోటీల్లో సహస్ర ప్రతిభ కనబరిచింది. బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందని ఆయన పేర్కొన్నారు. 2026 జనవరి 10 నుంచి న్యూడిల్లీలో జరిగే స్కూల్‌ గేమ్స్‌ కుస్తీ పోటీల్లో ఆమె పాల్గొంటుందని తెలిపారు. ఈమేరకు సహస్రను రెజ్లింగ్‌ అసొసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శానబోయిన రాజ్‌కుమార్‌ గురువారం సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి సుధాకర్‌, ప్రమోద్‌, శ్రీధర్‌, శంకర్‌, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

6న జాబ్‌మేళా

కాళోజీ సెంటర్‌: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నిర్వహిస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్‌ బీ కార్యక్రమం కోసం ఈనెల 6న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరంలో ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు, 2026లో ఉత్తీర్ణులు కానున్న ఇంటర్‌ విద్యార్థులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మెగా జాబ్‌డ్రైవ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులు 75 శాతం ఓవరాల్‌గా, మ్యాథమెటిక్స్‌లో 60 శాతం మార్కులు పొందిన విద్యార్థులు టెన్త్‌ మెమో, 2026లో ఉత్తీర్ణులు కానున్న విద్యార్థులు ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీలు, ఒక ఫొటో, ఆండ్రాయిడ్‌ మొబైల్‌తో జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు హెచ్‌సీఎల్‌ ప్రతినిధి 7569177071, 7981834205 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

కొలతలు పక్కాగా నమోదు చేయాలి

బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: భవన నిర్మాణాల అసెస్మెంట్ల కొలతలు పక్కాగా నమోదు చేయాలని బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం హంటర్‌ రోడ్డు ప్రాంతంలో న్యూశాయంపేట జంక్షన్‌ విల్లాస్‌ రోడ్డు, భద్రకాళి బండ్‌ వైపు వెళ్లే ప్రాంతాల్లో నమోదు చేసిన అసెస్మెంట్ల కొలతలను కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమర్థవంతంగా లెక్కించాలని సూచించారు. ఈసందర్భంగా బల్దియా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు నమోదు చేసిన కొలతలను కమిషనర్‌ పునఃపరిశీలించి నిర్ధారణ చేసి నమోదు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన భవనాలకు పర్మిషన్‌ డాక్యుమెంట్లను, అనధికారిక నిర్మాణాలను పరిశీలించి అందుకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ ఆర్‌ఐ రజని, వార్డు ఆఫీసర్‌ శిరీష బిల్‌ కలెక్టర్‌ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలందించాలి
1
1/2

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి
2
2/2

మెరుగైన వైద్య సేవలందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement