ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం?
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సభలో మాట్లాడనున్న ఆయన ఉమ్మడి వరంగల్‌పై నిధుల జల్లు కురిపిస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అంతకు ముందు గ్రామ పంచాయతీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో తాజా పరిస్థితి ఏమిటి? పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏం జరుగుతోంది.. ? అని మాట్లాడనున్నారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచేలా రేవంత్‌రెడ్డి మరోసారి మార్గదర్శనం చేయనున్నారని తెలిసింది.


