తేలిన మొదటి విడత లెక్క
వరంగల్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే 91 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు పోటీ చేసేందుకు 609 మంది పోటీ పడ్డారు. 304 మంది పోటీ నుంచి విరమించుకున్నారు. 80 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా 305 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. అదే విధంగా జిల్లాలోని 91 గ్రామ పంచాయతీల్లో 800 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 215 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 585 వార్డుల్లో ఎన్నికలు జరుగుతుండగా 1,457 మంది పోటీ పడుతున్నారు.
● రెండో విడతలో 117 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈవిడత ఒక సర్పంచ్ స్థానానికి నామినేషన్ పడకపోవడంతో 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
● 117 గ్రామ పంచాయతీల్లోని 1,008 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఐదు వార్డులకు నామినేషన్లు వేయలేదు. ఎన్నికలు జరుగుతున్న 1,003 వార్డుల్లో పోటీ చేసేందుకు 2,691 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుస్తాయి.
రెండో రోజు 186 నామినేషన్లు
వరంగల్ జిల్లాలో మూడో విడత 109 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో రోజు 186 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. 946 వార్డులకు మొదటి, రెండు రోజులకు కలిపి 647 నామినేషన్లు దాఖలయ్యాయి.
మండలం జీపీలు పడనివి ఎన్నికలు నామినేషన్లు
దుగ్గొండి 34 0 34 186
గీసుకొండ 21 0 21 156
నల్లబెల్లి 29 0 29 179
సంగెం 33 1 32 178
మొత్తం 117 1 116 699
రెండో విడత వార్డుల నామినేషన్లు
మండలం వార్డులు పడనివి ఎన్నికలు నామినేషన్లు
దుగ్గొండి 282 0 282 749
గీసుకొండ 188 0 188 574
నల్లబెల్లి 252 0 252 666
సంగెం 286 5 281 702
మొత్తం 1,008 5 1,003 2,691
మొదటి విడత సర్పంచ్ నామినేషన్లు
మండలం జీపీలు ఏకగ్రీవం ఎన్నికలు ఉపసంహరణ బరిలో ఉన్న అభ్యర్థులు
పర్వతగిరి 33 3 30 134 120
రాయపర్తి 40 6 34 132 117
వర్ధన్నపేట 18 2 16 38 68
మొత్తం 91 11 80 304 305
వార్డు స్థానాలు..
మండలం పంచాయతీలు వార్డులు ఏకగ్రీవం ఎన్నికలు బరిలో ఉన్నవారు
పర్వతగిరి 33 288 75 213 498
రాయపర్తి 40 342 108 234 604
వర్ధన్నపేట 18 170 32 138 325
మొత్తం 91 800 215 585 1,427
11 మంది సర్పంచ్‌లు,
215 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం
80 సర్పంచ్ స్థానాల్లో 305 మంది, 585 వార్డుల్లో 1,427 మంది పోటీ
రెండో విడత సర్పంచ్ స్థానాలకు 699, వార్డుల్లో 2,691 నామినేషన్లు ఓకే


