breaking news
Unanimous elected panchayats
-
6 పంచాయతీలు ఏకగ్రీవం
అనంతపురం: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందే ఆరుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ రోజైన గురువారం ఆయా పంచాయతీలకు నామినేషన్లు వేసిన వారిలో పలువురు ఉపసంహరించుకోగా.. ఆరు పంచాయతీల్లో మాత్రం ఒక్కో నామినేషనే మిగిలింది. దీంతో కదిరి మండలం ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్‌గా శుభలేఖ, గాండ్లపెంట మండలం జీపీ తండా సర్పంచ్‌గా భూక్యా రవీంద్రనాయక్, నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్‌గా డుంగావత్ పార్వతి, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్‌గా హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్‌గా లీలావతి ఏకగ్రీవమయ్యారు. అలాగే తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పలు పంచాయతీల్లోని వార్డు స్థానాలు కూడా ఏకగ్రీమయ్యాయి. ఆయా పంచాయతీల్లోని వారంతా కలసికట్టుగా గ్రామాల అభివృద్ధికి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రజాప్రతినిధులు స్వాగతించారు. కాగా తొలివిడతలో కదిరి డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 169 పంచాయతీలు, 1,714 వార్డు స్థానాలకు ఈనెల 9న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ గురువారం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులను పంచాయతీల వారీగా అధికారులు ధ్రువీకరించారు. సర్పంచ్ బరిలో 462 మంది తొలి విడతలో 163 పంచాయతీలకు ఎన్నికలు జరVýæనుండగా 462 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పంచాయతీల్లోని మొత్తం 1,714 వార్డులుండగా..715 వార్డులు ఏకగ్రీవమయ్యారు. తక్కిన 987 వార్డులకు 2,030 మంది బరిలో నిలిచారు. గుర్తులు కూడా కేటాయించడంతో చాలా మంది గురువారమే ప్రచారం చేయడం కనిపించింది. కాగా కదిరి డివిజన్ పరిధిలోని పంచాయతీలకు శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల నిర్వహణ సామగ్రిని తరలించనున్నారు. కదిరి నియోజకవర్గంలో రెండు కదిరి అర్బన్/గాండ్లపెంట: తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న కదిరిలో నామినేషన్ల ఉపసంహరణ రోజు రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కదిరి మండలంలోని ముత్యాలచెరువు పంచాయతీ సర్పంచ్‌గా బరిలో నిలిచిన వలంటీర్ నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానానికి శుభలేఖతో పాటు మానస, గౌతమి, నారాయణమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే గురువారం మిగతా ముగ్గురూ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో నారిక శుభలేఖ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఇక గాండ్లపెంట మండలం తుమ్మలబైలు తండా సర్పంచ్ స్థానానికి నలుగురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా, గురువారం ముగ్గురు ఉపసంహరించుకోవడంతో బి.రవీంద్రనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటరి్నంగ్ అధికారి లక్ష్మీప్రియ ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన శుభలేఖ, బి.రవీంద్రనాయక్లను ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి అభినందించారు. పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నాలుగు పుట్టపర్తి: నియోజకవర్గంలో నాలుగు పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నల్లమాడ మండలం కొండకింద తండా సర్పంచ్‌గా పార్వతీ, బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్‌గా విజయకుమారిబాయి, కొత్తచెరువు మండలం లింగారెడ్డిపల్లి సర్పంచ్‌గా పాటిల్ హరిత, పుట్టపర్తి మండలం చెర్లోపల్లి సర్పంచ్‌గా లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరందరినీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అభినందించారు. విజయకుమారిని వరించిన అదృష్టం బుక్కపట్నం మండలం మదిరేబైలు తండా సర్పంచ్ స్థానానికి ఇద్దరు నామినేషన్ వేయగా.. గురువారం ఓ అభ్యరి్థని నామినేషన్ ఉపసంహరించుకోగా.. విజయకుమారిబాయి ఏకగ్రీవమయ్యారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా, సరస్వతి గురువారం నామినేషన్ ఉపసంహరించుకోగా.. లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలేవీ?
జంగారెడ్డిగూడెం రూరల్: ఎన్నికల ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రోత్సాహక నిధులను ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉంటే రూ. 15 లక్షలు, 15వేల జనాభా దాటితే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించిన ఏకగ్రీవ పంచాయతీలకు నిరాశే ఎదురైంది. వాటికి ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 2013 జూలై 27నగ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 17 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులను అందజేయడంపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. జంగారెడ్డిగూడెం డివిజన్లో జంగారెడ్డిగూడెం మండలంలో అమ్మపాలెం, పుట్లగట్లగూడెం, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, దొరమామిడి, కోయ రాజమండ్రి, ముంజులూరు, కొయ్యలగూడెం మండలంలో అచ్యుతాపురం, డిప్పకాయలపాడు, పోలవరం మండలంలో గెడ్డపల్లి, ఎల్అండ్డిపేట, మామిడిగొంది, వింజరం, చింతలపూడి మండలంలో నామవరం, కామవరపుకోట మండలంలో కెఎస్ రామవరం, పోలాసిగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమయ్యాయని డివిజన్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులను వెంటనే మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయా పంచాయతీల పాలకవర్గాలు కోరుతున్నాయి.