ఢిల్లీ: లోక్‌సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌పై విమర్శలు గుప్పించారు.
చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. మోదీ ఇమేజ్‌ను క్రియేట్ చేసిన వాళ్లే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో విడుదల చేయనివి ఇంకా ఉన్నాయి. అమెరికాలో అదానీపై కేసు నమోదు చేశారు. వాళ్ల టార్గెట్ అదానీ కాదు.. మోదీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం. యూఎస్-ఇండియా ట్రేడ్ నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంది. ఇప్పటికిప్పుడు భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందంపై కేంద్రం ఆమోదం ఎందుకు తెలిపింది.
‘మోదీ చాలా భయంతో ఉన్నారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు. ట్రంప్ ఒత్తిడితోనే ట్రేడ్ డీల్‌పై ప్రధాని మోదీ సంతకాలు చేశారు. రైతుల రక్త మాంసాలను కేంద్రం అమ్ముకుంది. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారు.’ అని దుయ్యబట్టారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
లోక్‌సభలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్‌కు గుయ్యారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంతవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. సెక్రటరీ జనరల్ బెంచ్‌పైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ సజావుగా జరగనీయకుండా అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, వారింగ్, కిరణ్ రెడ్డి సస్పెన్షతో పాటు మొత్తం ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.


