రామ్‌దేవ్‌ పతంజలికి డాబర్ దెబ్బ | Delhi HC Key Orders On Ramdev Patanjali Misleading Dabur Ads | Sakshi
Sakshi News home page

రామ్‌దేవ్‌ పతంజలికి డాబర్ దెబ్బ

Jul 3 2025 12:26 PM | Updated on Jul 3 2025 12:35 PM

Delhi HC Key Orders On Ramdev Patanjali Misleading Dabur Ads

బాబా రాందేవ్‌ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్‌ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. డాబర్ చ్యవన్‌ప్రాష్‌(Chyawanprash)ను లక్ష్యంగా చేసుకుని పతంజలి ప్రసారం చేస్తున్న సెటైరిక్‌ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం గురువారం ఆదేశించింది. 

న్యూఢిల్లీ: చ్యవన్‌ప్రాష్‌ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్‌(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్‌ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్‌ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్‌ కంపెనీ పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాదు.. 

తమ బ్రాండ్‌ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్‌ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్‌) చ్యవన్‌ప్రాష్‌లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్‌ తన పిటిషన్లో ప్రస్తావించింది. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి మినీ పుష్కర్ణా యాడ్‌ నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జులై 14వ తేదీన జరగనుంది. 

చ్యవన్‌ప్రాష్‌ (Chyawanprash) అనేది ఆయుర్వేద లేహ్యం.  ఇది శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాడే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమం. ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు చ్యవన్ ఋషి అనే మహర్షి ఈ లేహ్యాన్ని తయారు చేసినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement