పరస్పర అంగీకారంతో విడాకులపై (Mutual Consent Divorce) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక తీర్పునిచ్చింది. విడాకుల కోసం మొదటి మోషన్ దాఖలు చేయడానికి ఒక సంవత్సరం విడిగా జీవించాల్సిన షరతు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ కాలాన్ని సెక్షన్ 14(1) ప్రొవైజో ఆధారంగా కోర్టు (ఫ్యామిలీ కోర్టు లేదా హైకోర్టు) మాఫీ చేయవచ్చని తెలిపింది.
అలాగే, ఆరు నెలల కూలింగ్-ఆఫ్ పీరియడ్ (ఫస్ట్ మోషన్ – సెకండ్ మోషన్ మధ్య) కూడా స్వతంత్రంగా మాఫీ చేయవచ్చని పేర్కొంది. విడాకులు కోరుతున్న దంపతులను బలవంతంగా వివాహ బంధంలో ఉంచడం కోర్టు ధర్మం కాదని వెల్లడించింది.
ఇలా చేయడం విడిపోవాలని నిశ్చయించుకున్న వారి ఆత్మగౌరవం మరియు స్వేచ్ఛకు విరుద్ధవుతుందని వ్యాఖ్యానించింది. శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్ (జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ అనూప్ జైరామ్ భంభాని, జస్టిస్ రేణు భట్నాగర్) ఈ తీర్పు వెలువరించింది.


