పతనంతిట్ట: ఎరుమేలి మీదుగా సాంప్రదాయ (పెద్దపాదం) అటవీ మార్గం గుండా శబరిమల పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తులకు రేపటి నుంచి(డిసెంబర్ 18, గురువారం) ప్రత్యేక పాస్‌లను అటవీ శాఖ అందించనుంది. ముకుళి వద్ద ఈ పాస్‌ల పంపిణీ చేయనున్నారు.
ప్రత్యేక పాస్‌లు పంపిణీ చేయాలని భక్తులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సన్నిధానం చేరుకోవడానికి 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడిచిన భక్తులు.. గంటలు తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. ప్రత్యేక పాస్ ప్రవేశపెట్టడంతో భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి.
అటవీ మార్గం ద్వారా వచ్చే భక్తులను మరకూట్టం నుంచి చంద్రనందన్ రోడ్డు, నడపండల్ ద్వారా ప్రత్యేక క్యూలలో పంపిస్తారు. తద్వారా వారు నేరుగా 18 పవిత్ర మెట్లను ఎక్కడానికి అనుమతిస్తారు. ఈ వ్యవస్థ రేపటి నుండి సన్నిధానంలో అమల్లోకి వస్తుంది.


