సాక్షి శబరిమల: "అందరికి ఫిర్యాదు లేని సౌకర్యవంతమైన దర్శనం" అనే పోలీసుల విజన్‌ని అమలు అయ్యేలా చేశామని కేరళ ఏడీజీపీ శ్రీజిత్ అన్నారు. శబరిమల యాత్ర ప్రారంభమైన 28 రోజుల తర్వాత గతేడాది కంటే సుమారు 4.5 లక్షల మందికి పైగా యాత్రికులు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. సింపుల్‌గా చెప్పాలంటే సగటున రోజుకి దాదాపు 80 వేల మందికి పైగా వచ్చారని అన్నారు. గత సోమవారం అత్యధిక సంఖ్యలో ఏకంగా ఒక లక్ష మందికి పైగా యాత్రికలు దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 24న కూడా ఇలా భక్తుల సంఖ్య లక్ష దాటిందని గుర్తు చేశారు.
ఇదంతా అయ్యప్ప మహిమే..
దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులెవ్వరూ దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండటం లేదా ఫిర్యాదు చేయడం వంటివి చేయలేదని అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ వల్లనే అని చెప్పారు. నిజానికి అధికారులెవ్వరూ యాత్రికులెవరిని ఆపరు, ఇబ్బంది పెట్టరని, కూడా చెప్పారు. భక్తులను పర్వతం ఎక్కడానికి అవకాశం ఇస్తే..భక్తలు ఎవరూ వేచి ఉండాల్సి అవసరం ఏర్పడదు, అలాగే వాళ్లు నేరుగా పుణ్యక్షేత్రానికి చేరుకుని 18వ మెట్టు ఎక్కి ఆ హరిహరసుతుడిని ఎలాంటి ఫిర్యాదుల లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలుగుతారని అన్నారు..
అదెలా సాధ్యమన్నది అతుపట్టడం లేదు..
కాగా మకరవిళక్కు వరకు ప్రతిరోజూ వర్చువల్ క్యూ బుకింగ్‌లు పూర్తయ్యాయని చెప్పారు. అలాగే ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు. ఈసారి ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే శనివారం ఆదివారం రద్దీ తక్కువగా ఉంటుందని, బదులుగా, సోమవారం, మంగళవారం రద్దీ ఎక్కువయ్యిందని చెప్పారు.
చెప్పాలంటే బుధవారం మధ్యాహ్నం నాటికి రద్దీ తగ్గుముఖం పడుతోందని అన్నారు. విచిత్రం ఏంటంటే చాలా బుకింగ్‌లు ఉన్నప్పటికీ అలా ఎలా స్వామి కైంకర్యాలకు ఆటంకం లేకుండా, అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సవ్యంగా జరిగిపోతోందో మాకు కూడా తెలియడం లేదని ఆనందంగా చెప్పుకొచ్చారు. అయితే తామే ఎక్కడకక్కడ పోలీసులతో మోహరించి భక్తులెవ్వరూ దర్శనం కోసం వేచి ఉండకుండా పకడ్బందీగా చేయగలిగినన్నీ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు.
స్పాట్ బుకింగ్ పెంపు ఎప్పుడంటే..
సన్నిధానం వద్ద జనసమూహం ఎక్కువగా లేనప్పుడు, పోలీసు ప్రత్యేక అధికారి, ప్రత్యేక కమిషనర్, దేవస్వం కార్యనిర్వాహక అధికారులను సంప్రదించి స్పాట్ బుకింగ్ పెంచుతామని అన్నారు. జనసమూహం తక్కువగా ఉన్న రోజుల్లో, 10 వేలకు పైనే స్పాట్ బుకింగ్‌లు ఇస్తామని అన్నారు. అయితే యాత్ర మూడోరోజున యాత్రికులు ఎందుకు ఇబ్బంది పడ్డారో కూడా వివరించారు.
ఆ రోజు యాత్రికులు క్యూలో ఉన్నప్పుడు షెడ్ స్థంభం దెబ్బతినడంతో దాన్ని తొలగించడంతో కాస్త సమస్యలు రావడంతోనే భక్తులు ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సాధ్యమైనంతవరకుఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు కేరళ పోలీసు అత్యున్నతాధికారి శ్రీజిత్.
(చదవండి: ఆ హరిహరసుతుడి అరవణ ప్రసాదం డబ్బాల కొరత..)


