భారతదేశంలో ధూమపానం మరింత ఖరీదైనదిగా మారబోతోంది. భారత పార్లమెంటు సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025ను ఆమోదించింది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్నును విధించేలా 1944 సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది. దీన్ని ఈ నేపథ్యంలో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు గణనీయంగా పెరగనున్నాయి. అధిక సుంకాలు వినియోగదారుల ఖర్చులను తప్పనిసరిగా పెంచుతాయని, కాలక్రమేణా వినియోగాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పొగాకు వినియోగాన్ని అరికట్టడం , ప్రజారోగ్యాన్ని కాపాడటం అనే ఒకే స్పష్టమైన లక్ష్యంతో సిగరెట్లు, సిగార్లు, హుక్కా పొగాకు, నమిలే పొగాడు, సువాసనగల పొగాకుపై పన్నులను పెంచేందుకు ఈ చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం ఇప్పుడు పరిమాణం మరియు రకాన్ని బట్టి 1,000 రూ. 11,000 వరకు పెరగవచ్చు. చిన్న , ఫిల్టర్ సిగరెట్లు ధరలు బాగా పెరుగుతాయి. అటు ప్రీమియం వేరియంట్లపై కూడా ధరల పెంపు వాయింపు భారీగానే ఉండబోతోంది. పొగాకు సెస్సు రద్దు అయిన తర్వాత కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పెంచడానికి ఇది ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటును కూడా కల్పిస్తుంది.
చదవండి: ఆకు ఉమ్మితేనే భారీ జరిమానా; మనదగ్గర గుట్కా, ఖైనీల పరిస్థితి ఏంటి?
ఇటీవలి సవరణ ప్రకారం ఉత్పత్తి చేయని , తయారు చేయబడిన పొగాకు, పొగాకు ఉత్పత్తులు , ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా పెంచింది. ప్రధాన రేటు పెరుగుదలలు బాగా కనిపిస్తున్నప్పటికీ, GST పరిహార సెస్ నిలిపివేయడం వల్ల ఈ సవరణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉదాహరణకు, గతంలో రూ.200 నుండి రూ. 735 వరకు పలికిన 1,000 సిగరెట్ల ధర ఎక్సైజ్ సుంకం పెంపు తరువాత రకాన్ని బట్టి రూ.2,700 నుంచి రూ.11,000గా ఉండనునున్నాయి. ఈ రేట్లు ఎప్పటినుంచి అమల్లో ఉంటాయి అనేది ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు.
ఇతర పొగాకు ఉత్పత్తులు కూడా తీవ్రంగా ప్రభావితం కానున్నాయి
• నమిలే పొగాకు సుంకం 100శాతాకి పెంపు
• హుక్కా పొగాకుపై సుంకం 40శాతానికి పెంపు
• ముడి పొగాకుపై సుంకాలు 70శాతాని పెంపు
• సువాసనగల పొగాకుపై పన్ను 100శాతంగా కొనసాగుతుంది.
ఇదీ చదవండి: ఆధార్, పార్సిల్ అంటూ : మహిళా టెకీని బెదిరించి రూ. 2 కోట్ల మోసం


