ఢిల్లీలోని ప్రధాని కొత్త భవన సముదాయం పేరును సేవాతీర్థ్ గా మార్చుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. వాటితో పాటు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్ గా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే పలు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ ల పేరును కేంద్రం లోక్ భవన్ లుగా మార్చింది. ఈ నేపథ్యంలో మిగతా వాటి పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనితో పాటు రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చింది. రాజ్ భవన్ పేరు మార్చినట్లు నోటిఫికేషన్ రావడంతో హైదరాబాద్ లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రికార్డులన్నింటిలోనూ లోక్ భవన్ పేరును ప్రచురించబోతున్నట్లు పేర్కొన్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ భవనాలలోకి పీఏంఓతో పాటు ఇతర కీలకమైన శాఖల కార్యాలయాలను మార్చారు. పీఎంఓకు ప్రక్కనే క్యాబినెట్ సెక్రటేరియేట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియేట్, ఇండియా హౌస్ ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2016లో ప్రధాని నివాసం పేరును లోక్ కళ్యాణ్ మార్గ్ గా మార్చారు. కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్ గా, రాజ్ పథ్ ని కర్తవ్యపథ్ గా నామకరణం చేశారు.


