ఢిల్లీ: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకున్న విధ్వంసానికి బాధ్యత వహిస్తూ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం మమతా బెనర్జీ ఆమోదించారు. ఈనెల 13వ తేదీన తేదీన బెంగాల్లో మెస్సి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. ఘటన జరిగిన రోజు క్రీడాకారులకు క్షమాపణ చెప్పిన మమత బెనర్జీ.. ఆ విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు చేపట్టారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజాగా క్రీడామంత్రి రాజీనామాను సైతం ఆమోదించారు మమతా.
లియోనెల్ మెస్సీ కార్యక్రమంలో గందరగోళం, విధ్వంసం పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డిజిపి రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సిపి ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు & క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హా లకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిసిపి అనీష్ సర్కార్ (ఐపిఎస్) పై శాఖాపరమైన చర్యలు చేపట్టిందిప్రభుత్వం.


