అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఓ ఉదంతం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. అమృత్‌సర్‌కు చెందిన రవి గులాటి 15 ఏళ్లుగా తన భార్య హిమానీతో సంసారం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతను తన భార్యను ఒక హోటల్‌లో మరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విధంగా ఆమె భర్తను మోసం చేయడం ఇది మొదటిసారి కాదు.
భర్త తెలిపిన వివరాల ప్రకారం 2018లో కూడా ఆమె ఒక హోటల్‌లో వేరే వ్యక్తితో పట్టుబడింది. అప్పుడు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవి సంసారం కొనసాగించాడు. అలాగే ఆ సమయంలో భార్య తన తల్లిదండ్రుల సమక్షంలో క్షమాపణ చెప్పడంతో, పరిస్థితి చక్కబడుతుందని రవి ఆశించాడు. కానీ భార్య తీరుతెన్నులో ఏమాత్రం మార్పు రాలేదు. గతంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని రవితన భార్యకు చెందిన యాక్టివా వాహనానికి రహస్యంగా జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
ఇంతలో రవి పదేపదే ఫోన్ చేసినా ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో అనుమానం పెరిగింది. జీపీఎస్ లొకేషన్‌ను అనుసరించి రవి ఒక హోటల్‌కు చేరుకున్నాడు. అక్కడ రవి తన భార్య మరో వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన దరిమిలా రవి తండ్రి పర్వేజ్ గులాటి ఆమె ఇక తన కుమారునితో ఉండనక్కరలేదని, వారి పుట్టింటికి వెళ్లిపోవాలని తెగేసి చెప్పాడు. కాగా ఆమెతో పాటు పట్టిబడిన వ్యక్తిని ఆమె గతంలో తన సోదరునిగా భర్తకు పరిచయం చేసిందని పర్వేజ్ గులాటి తెలిపారు. రవి తండ్రి పర్వేజ్ తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తితో హిమానీ ఏడేళ్లుగా రహస్యంగా సంబంధం కొనసాగిస్తోంది. గతంలో క్షమాపణతో ఈ సమస్య శాంతియుతంగా ముగిసిందని భావించామని, అయితే అదే తప్పు మళ్లీ జరగడంతో ఆమెపై గౌరవం పూర్తిగా పోయిదని పర్వేజ్ తెలిపారు. ఈ కథనం ‘న్యూస్ 18’లోని వివరాల ఆధారంగా రాయడం జరగింది.


