ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాజన్, మనీష్ బేడీ అనే ఇద్దరు టెర్రరిస్టులు పాకిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రసంస్థ ఆదేశాల మేరకు భారత్‌లో ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరంతా ఆర్మేనియా నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత నెలలో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) NIA అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీగా సోదాలు నిర్వహిస్తుంది. అధికారులు ఇదివరకే పలువురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో 15 మంది మృతిచెందగా అనేక మంది గాయపడ్డారు. కాగా ఈ ఘటనతో సంబంధమున్న నిందితులను దర్యాప్తు బృందాలు ఇది వరకే అరెస్టు చేశాయి.


