breaking news
Wire
-
వైరల్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
-
నట్లు, వైరు, ఇనుప గుండు
జైపూర్ : ఆపరేషన్ ముగిసిన తర్వాత బుండి ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఒకింత షాక్‌కి గురయ్యారు. ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు వ్యక్తి కడుపులోంచి వైద్యులు ఇనుప నట్లు, వైరు, ఇనుప గుండు వంటి వస్తువులు బయటకు తీశారు. వివరాలు.. భోలా శంకర్ (42) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ.. స్థానిక బుండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఎక్స్ రే తీసిన వైద్యులు ఆ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. అతని కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు రిపోర్టుల్లో కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్ చేశారు. ఆ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో శంకర్‌కి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో అతని కడుపులోంచి 6.5 సెంటిమీటర్ల పొడవున్న 116 ఇనుప నట్లతో పాటు.. ఓ వైర్, ఇనుప గుండును కూడా బయటకు తీశారు. ఈ వస్తువులు చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఇది కడుపా.. ఇనుప సామాన్ల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం శంకర్ కోలుకుంటున్నాడని.. అయితే ఈ వస్తువులన్ని అతనికి కడుపులోకి ఎలా వెళ్లాయనే విషయం గురించి అతనేం మాట్లాడటం లేదని వైద్యులు తెలిపారు. -
వైరులో బంగారు తీగలు..
శంషాబాద్ : రోజుకో రకంగా బంగారం తెచ్చే వారిని చూస్తూ శంషాబాద్ విమానాశ్రయం అధికారులు కళ్లు తేలేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు బంగారం తెచ్చే విధానం రోజుకో తీరులో ఉంటోంది. షూల్లో, ఎలక్ట్రానిక్ పరికరాల్లో, చివరికి శరీరంలో దాచుకుని బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ దాఖలాలు నిత్యం చూస్తున్నాం. అలాంటిదే తాజాగా మరో పద్ధతి వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఓ యువకుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగు లోపల వైరు కనిపించడంతో అనుమానం వచ్చిన అధికారులు నిశితంగా పరిశీలించారు. వైరు లోపలి భాగంలో 1,100 గ్రాముల బంగారం తీగలు బయటపడ్డాయి. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.