పుణే వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో అన్మోల్‌ప్రీత్ సింగ్(47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైల్ ఆరోరా(42), రమణ్‌దీప్ సింగ్(43), హర్నార్ సింగ్(42) రాణించారు.
ఆంధ్ర బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ రాజు, సౌరభ్ కుమార్, పృథ్వీరాజ్ తలా వికెట్ సాధించారు. మధ్యప్రదేశ్‌పై హ్యాట్రిక్‌తో సత్తాచాటిన నితీశ్ రెడ్డి.. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌కే పరిమితమయ్యాడు.
హేమంత్ రెడ్డి సూపర్ సెంచరీ..
206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది. నితీశ్ కుమార్ బ్యాటింగ్‌లో కూడా విఫలమయ్యాడు. రెండు బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అతడితో పాటు శ్రీకర్ భరత్(1), అశ్విన్ హెబ్బర్(4), రికీ భుయ్(15) నిరాశపరిచారు.
కానీ మర్మరెడ్డి హేమంత్ రెడ్డి సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 53 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. హేమంత్‌తో పాటు ఎస్డీఎన్వీ ప్రసాద్(35 బంతుల్లో 53 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆంధ్ర తమ తదుపరి సూపర్ లీగ్ మ్యాచ్‌లో డిసెంబర్ 16న జార్ఖండ్‌తో తలపడనుంది.
చదవండి: శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై


