ఐపీఎల్-2026 సీజన్ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయో సీజన్‌లో కూడా తమ జట్టు కెప్టెన్‌గా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానేను కొనసాగించాలని కేకేఆర్ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న మినీ వేలానికి కూడా అతడు హాజరు కానున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. గత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో కేకేఆర్ దారుణ ప్రదర్శన కనబరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్దానంలో నిలిచింది. అజింక్య తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2026లో రహానేను కేకేఆర్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. కానీ కేకేఆర్ యాజమాన్యం మాత్రం రహానేకు మరో అవకాశమిచ్చేందుకు సిద్దమైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఈ సీజన్‌లో అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా మరోసారి అతడు కేకేఆర్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశముంది. ఎందుకంటే కెప్టెన్సీ సత్తా ఉన్న ఆటగాడు ఎవరూ వేలంలో లేరు. యువ ఆటగాడు రఘువంశీ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతడిని వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఉపయోగించుకోవాలని కేకేఆర్ భావిస్తుందని బంగర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
గ్రీన్‌పై కన్ను..
కాగా కేకేఆర్ రూ. 64.30 కోట్లు పర్స్‌తో వేలంలోకి వెళ్లనుంది. ఇది అన్ని జట్ల కంటే అత్యధిక మనీ కేకేఆర్ వద్దే ఉంది. నైట్‌రైడర్స్ మొత్తంగా 13 స్ధానాలను భర్తీ చేయనుంది. అందులో విదేశీ ఆటగాళ్ల స్ధానాలు ఆరు ఉన్నాయి. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను దక్కించుకునేందుకు కేకేఆర్ ప్రయత్నించే అవకాశముంది.
ఈ వేలానికి ముందు కేకేఆర్ రహానే పాటు రింకూ సింగ్, సునీల్ నరైన్, రోవ్‌మన్ పావెల్, వరుణ్ చక్రవర్తి, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, అంకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, వైభవ్ అరోరాతో సహా మొత్తం 12 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
వదేలిసిన ఆటగాళ్లు వీరే..
ఆండ్రీ రస్సెల్ (₹12 కోట్లు)
వెంకటేష్ అయ్యర్ (₹23.75 కోట్లు)
క్వింటన్ డి కాక్
రహమనుల్లా గుర్బాజ్
అన్రిచ్ నోర్ట్జే
మొయిన్ అలీ
చదవండి: IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్‌క్యాప్డ్ బౌలర్ల మీదే!


