అండర్-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ అండర్-19 జట్టు 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది.
సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయూష్ మాత్రే, హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం మాత్రే ఔటయ్యాక విహాన్ మల్హోత్రా(12), వేదాంత్(7) వికెట్లను కోల్పోయింది.
అనంతరం జార్జ్, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు(22) కాసేపు పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కనిష్క్ చౌహాన్ కాస్త దూకుడుగా ఆడాడు. అయితే జార్జ్, చౌహన్ ఔటయ్యాక భారత టెయిలాండర్లు ఎక్కవ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
దీంతో మరో 17 బంతులు మిగిలూండగానే టీమిండియా ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్(85) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కనిష్క్ చౌహాన్(46), మాత్రే(38) రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ సయ్యామ్, అబ్దుల్ సుభాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నిఖాబ్ షఫీక్ రెండు వికెట్లు సాధించారు.
చదవండి: శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై


