IND vs PAK: టాస్‌గెలిచిన పాకిస్తాన్‌.. భారత్‌ బ్యాటింగ్‌ | U19 Asia Cup 2025 Ind vs Pak, Pakistan Won Toss, Check Out Final Playing XIs And Other Details Inside | Sakshi
Sakshi News home page

IND vs PAK: టాస్‌గెలిచిన పాకిస్తాన్‌.. భారత్‌ బ్యాటింగ్‌

Dec 14 2025 10:59 AM | Updated on Dec 14 2025 1:14 PM

U19 Asia Cup 2025 Ind vs Pak: Pakistan Won Toss Check Playing XIs

ఆసియా క్రికెట్‌ మండలి అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో.. ఆయుశ్‌ మాత్రే సేనను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం కాగా.. మ్యాచ్‌ను నలభై తొమ్మిది ఓవర్లకు కుదించారు.

తొలి మ్యాచ్‌లలో ఘన విజయాలు
కాగా అండర్‌-19 ఆసియా కప్‌లో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ, మలేషియా.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, నేపాల్‌ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ యూఏఈ (IND vs UAE)ని.. పాక్‌ మలేషియా (PAK vs MLY)ను చిత్తుగా ఓడించి శుభారంభం అందుకున్నాయి. 

తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో దాయాదులు అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో భారత చిచ్చరపిడుగు, యూఏఈతో మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పైనే కళ్లన్నీ ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలా ఒక మ్యాచ్‌ గెలిచి టాప్‌-2లో ఉండగా.. గ్రూప్‌-ఎలో పాక్‌, భారత్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌ అండర్‌-19 వర్సెస్‌ పాకిస్తాన్‌ అండర్‌-19 తుదిజట్లు
భారత్‌
ఆయుష్ మాత్రే(కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్‌ కీపర్‌), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్.

పాకిస్తాన్‌
ఉస్మాన్ ఖాన్, సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్‌), హమ్జా జహూర్(వికెట్‌ కీపర్‌), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.

చదవండి: తుదిజట్టు, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు!.. సౌతాఫ్రికా కోచ్‌ ఏమన్నాడంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement