ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఐపీఎల్ బ్యాన్ ఎదుర్కొంటున్న బ్రూక్‌కు సన్‌రైజర్స్ ఎలా ఆఫర్ చేసిందా అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి కథనం చదవాల్సిందే.
ఇంగ్లండ్‌కు చెందిన 'ది హండ్రెడ్' (The Hundred) 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ లీడ్స్ (గతంలో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్) తమ రిటెన్షన్ పక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హ్యారీ బ్రూక్‌ను ఏకంగా 4,70,000 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 5.62 కోట్లు) వెచ్చించి రిటైన్ చేసుకుంది.
పేరు మార్పు..
ది హాండ్రెడ్ లీగ్ 2025 సీజన్‌కు ముందు నార్తరన్ సూపర్‌చార్జర్స్ ఫ్రాంచైజీలో 49% వాటాను సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానులైన సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. మిగితా 1 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది.
కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది. ఈ క్రమంలో గత నెలలో నార్తరన్ సూపర్‌చార్జర్స్ పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా మార్చారు. ఇక బ్రూక్ విషయానికి వస్తే.. 2021 నుంచి సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీలో ఉన్నాడు.
ఆ తర్వాత 2024లో కెప్టెన్‌గా అతడు ఎంపికయ్యాడు. ఫ్రాంచైజీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా బ్రూక్ కొనసాగుతున్నాడు. రాబోయో సీజన్‌లో కూడా అతడు జట్టును ముందుండి నడిపించనున్నాడు. 'ది హండ్రెడ్' లీగ్ 2026 వేలం వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.
ఐపీఎల్ నిషేధం
హ్యార్ బ్రూక్ ప్రస్తుతం ఐపీఎల్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్-2025 వేలంలో బ్రూక్‌ను రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్ నుంచి తప్పుకొంటున్నట్లు బ్రూక్ తెలిపాడు.
అయితే బీసీసీఐ రూల్ ప్రకారం.. సరైన కారణాలు లేకుండా ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి వైదొలిగితే వారిపై నిషేధం పడుతోంది. ఈ క్రమంలోనే బ్రూక్‌పై బీసీసీఐ వేటు వేసింది. హ్యారీ బ్రూక్ 2028 వేలం వరకు ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిందే.
చదవండి: BCCI: శుభ్‌మన్ గిల్‌కు మరో బిగ్ ప్రమోషన్..!


