టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మరో బిగ్ ప్రమోషన్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్దమైంది. 2025/26 సీజన్‌కు సంబంధించిన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గిల్‘ఏ ప్లస్’ కేటగిరీకి పదోన్నతి పొందే అవకాశం ఉంది.
డిసెంబర్ 22న జరగనున్న బీసీసీఐ 31వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆటగాళ్ల కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం గిల్ ప్రమోషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. గిల్ ప్రస్తుతం గ్రేడ్-ఎలో ఉన్నాడు. అందుకు గాను ప్రతీ ఏటా రూ. 5 కోట్లను జీతంగా అందుకుంటున్నాడు.
అయితే ఇప్పుడు ‘ఏ ప్లస్’ కేటగిరీలో గిల్‌కు చోటు దక్కితే ప్రతీ ఏటా ఇకపై రూ.7 కోట్లు వార్షిక వేతనం తీసుకోనున్నాడు. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ,రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అయితే రో-కో ద్వయం కేవలం ఒక్క ఫార్మాట్‌లో ఆడుతుండడంతో వారిని గ్రేడ్-ఎకు డిమోట్ చేసే అవకాశముంది.
శుభ్‌మన్ గిల్ రైజ్
శుభ్‌మన్ గిల్.. అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో రోహిత్ శర్మ నుంచి టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్.. ఇంగ్లండ్ గడ్డపై అదరహో అనిపించాడు. అతడి నాయకత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది.
ఆ తర్వాత అక్టోబర్‌లో వన్డే కెప్టెన్‌గా కూడా గిల్ బాధ్యతలు చేపట్టాడు. అంతేకాకుండా టీ20ల్లో భారత వైస్ కెప్టెన్‌గా గిల్ ఉన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత గిల్‌ను టీమిండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?


