అత్యాచార ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన పాకిస్తాన్ బ్యాటర్ హైదర్ అలీపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎత్తేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఆడేందుకు అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) ఇచ్చింది.
హైదర్ అలీతో పాటు మొత్తం 9 మంది ఆటగాళ్లకు పీసీబీ బుధవారం ఎన్‌ఓసీలు ఇచ్చింది. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 35 టి20లు, మూడు వన్డేలు ఆడిన హైదర్ అలీ... పాకిస్తాన్ షాహీన్స్ జట్టు తరఫున ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయంలో... ఇంగ్లండ్‌లో పుట్టిన పాకిస్తానీ మహిళ అతడిపై అత్యాచార ఆరోపణలు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాంచెస్టర్ పోలీసులు సరైన ఆధారాలు లేని కారణంగా సెప్టెంబర్ 25న ఈ కేసును మూసివేశారు. దీంతో అతడిపై మోపిన ఆరోపణలు అబద్ధం అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో హైదర్ అలీ బీపీఎల్‌లో ఆడేందుకు అనుమతివ్వాలని పీసీబీని కోరగా... అందుకు బోర్డు అంగీకారం తెలిపింది.
హైదర్ అలీతో పాటు మొహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సాహబ్‌జాదా ఫర్హాన్, ఫహీమ్ అష్రఫ్, హుసేన్ తలత్, ఖ్వాజా నఫా, ఎహెసానుల్లాకు పీసీబీ నిరభ్యంతర పత్రాలు ఇచ్చింది. ఇక సీనియర్ ప్లేయర్ ఉమ్రాన్ అక్మల్ అభ్యర్థనను మాత్రం బోర్డు తిరస్కరించింది.
చదవండి: IPL 2026 SRH Plans: కావ్య మారన్ మాస్టర్ ప్లాన్..! యార్కర్ల కింగ్‌పై కన్ను?


