
ఆసియాకప్-2025 రన్నరప్‌గా పాకిస్తాన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ జట్టు ఫైనల్‌కు చేరినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమైంది. భారత్‌పై ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పాక్ చిత్తు అయింది.
ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అఘా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మెగా ఈవెంట్‌లో సల్మాన్ బ్యాటర్‌గా లీడర్‌గా తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఖండాంతర టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 సగటుతో 72 పరుగులు చేశాడు.
ఆఖరికి ఒమన్, యూఏఈ వంటి పసికూనలపై కూడా అతడు రాణించలేకపోయాడు. అతడి ప్రదర్శలనపై పీసీబీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్టర్లు, హెడ్ కోచ్ మైక్ హుస్సేన్ అతడికి సపోర్ట్‌గా ఉన్నప్పటికి పాక్ క్రికెట్ బోర్డు పెద్దలు మాత్రం గుర్రుగా ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
పాక్ జట్టు ఈ నెలఖారున దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా అతడు విఫలమైతే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా తొలిగించే అవకాశముంది.
కెప్టెన్‌ల మార్పు పాక్‌కు కొత్తేమి కాదు. టీ20ల్లో బ్యాటర్‌గా కూడా సల్మాన్‌కు మంచి రికార్డు ఏమి లేదు. ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో అతడు 110 స్ట్రైక్ రేట్‌తో 561 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టులోకి సీనియర్లు రిజ్వాన్, బాబర్ ఆజం రానున్నట్లు తెలుస్తోంది.
ఆసియాకప్‌నకు వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిద్దరికి తిరిగి పిలుపునవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ