భారత జట్టు ముమ్మర సాధన | Indian cricket team preparing for semi final match | Sakshi
Sakshi News home page

భారత జట్టు ముమ్మర సాధన

Mar 4 2026 4:03 AM | Updated on Mar 4 2026 8:51 AM

Indian cricket team preparing for semi final match

టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత క్రికెట్‌ జట్టు పూర్తి స్థాయి సాధనలో పాల్గొంది. ముంబైలోనే వాంఖెడే మైదానంలో మంగళవారం సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్‌లో జట్టులో 15 మంది సభ్యులందరూ పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా జట్టు ప్రాక్టీస్‌ దాదాపు గంట ఆలస్యంగా మొదలైంది. బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ పర్యవేక్షణలో అభిషేక్‌ శర్మ ప్రత్యేకంగా ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. 

ఈ టోర్నీలో అభిషేక్‌ ఆఫ్‌ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడు. తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ అటు స్పిన్, ఇటు పేస్‌ బౌలింగ్‌లో సాధన చేశారు. కుల్దీప్‌ బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌లపై తిలక్‌ దృష్టి పెట్టాడు. అర్ష్ దీప్‌ సింగ్‌ యార్కర్లను సంధించడంపై ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయగా, బుమ్రా మాత్రం ఎదురుగా బ్యాటర్‌ లేకుండా తనదైన శైలిలో స్పాట్‌ బౌలింగ్‌కే ప్రాధాన్యతనిచ్చాడు. 

హార్దిక్‌ పాండ్యా మాత్రం భారీ షాట్లపైనే దృష్టి పెడుతూ ప్రతీ బంతినీ బౌండరీకి తరలించే తరహాలో సాధన చేశాడు. సెమీస్‌కు రెండు రోజుల మాత్రం పిచ్‌పై చాలా పచి్చక కనిపిస్తున్నా...మ్యాచ్‌ ముందు దానిని తొలగించే అవకాశం ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement