breaking news
Salman Agha
-
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. రాణించిన పాక్ బ్యాటర్లు
రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) తొలి టెస్ట్ మొదలైంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో (Pakistan vs South Africa) పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు పాక్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో పాక్ మంచి స్కోర్ సాధించింది. ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్‌లో ఉన్నారు.పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
ఆసియాకప్‌లో అట్టర్ ప్లాప్.. పాక్ కెప్టెన్‌పై వేటు!?
ఆసియాకప్-2025 రన్నరప్‌గా పాకిస్తాన్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ జట్టు ఫైనల్‌కు చేరినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమైంది. భారత్‌పై ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పాక్ చిత్తు అయింది.ముఖ్యంగా కెప్టెన్ సల్మాన్ అఘా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మెగా ఈవెంట్లో సల్మాన్ బ్యాటర్‌గా లీడర్‌గా తీవ్ర నిరాశపరిచాడు. ఈ ఖండాంతర టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 సగటుతో 72 పరుగులు చేశాడు.ఆఖరికి ఒమన్, యూఏఈ వంటి పసికూనలపై కూడా అతడు రాణించలేకపోయాడు. అతడి ప్రదర్శలనపై పీసీబీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్టర్లు, హెడ్ కోచ్ మైక్ హుస్సేన్ అతడికి సపోర్ట్‌గా ఉన్నప్పటికి పాక్ క్రికెట్ బోర్డు పెద్దలు మాత్రం గుర్రుగా ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. పాక్ జట్టు ఈ నెలఖారున దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా అతడు విఫలమైతే కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా తొలిగించే అవకాశముంది.కెప్టెన్ల మార్పు పాక్‌కు కొత్తేమి కాదు. టీ20ల్లో బ్యాటర్‌గా కూడా సల్మాన్‌కు మంచి రికార్డు ఏమి లేదు. ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో అతడు 110 స్ట్రైక్ రేట్‌తో 561 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టులోకి సీనియర్లు రిజ్వాన్, బాబర్ ఆజం రానున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్‌నకు వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిద్దరికి తిరిగి పిలుపునవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ -
Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..!
నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025) భారత్ పాకిస్తాన్‌ను (India vs Pakistan) చిత్తుగా ఓడించి 9వ సారి టైటిల్‌ను (వన్డే, టీ20) కైవసం చేసుకుంది. టీమిండియా (Team India) టైటిల్ గెలిచిన అనంతరం చాలా హైడ్రామా చోటు చేసుకుంది.భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. దీనికి ప్రతిగా నఖ్వీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని, మెడల్స్‌ను ఎత్తుకెళ్లిపోయాడు.భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకొని నఖ్వీ పుండుపై కారం చల్లారు. మధ్యలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నఖ్వీ చేతి నుంచి అందుకున్న రన్నరప్ చెక్‌ను అక్కడే పడేసి ఓవరాక్షన్ చేశాడు. పహల్గాం ఉగ్రవాడికి ప్రతిగా భారత ఆటగాళ్లు ఈ టోర్నీ ఆరంభం నుంచి పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్‌ను నిరాకరించిన విషయం తెలిసిందే. ఫైనల్ సహా ఇరు జట్లు తలపడిన మూడు సందర్భాల్లో ఇదే జరిగింది.ఈ హైడ్రామా నడుమ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంచలన నిర్ణయం తీసుకొని పాకిస్తానీల గుండెల్లో అగ్గి రాజేస్తూ, తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ ద్వారా అతనికి లభించబోయే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పహల్గాం ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు, అలాగే భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.స్కై తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ భారతావణి హర్షం వ్యక్తం చేస్తుంది. భారతీయులంతా స్కైను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్కైను కాపీ కొడుతూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) 'ఆపరేషన్ సిందూర్' బాధితులకు తన ఆసియా కప్ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్‌కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు.చదవండి: Asia Cup: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.. -
అంత పొగరా?.. స్టేజ్ పైనే చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్! వీడియో
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా పాక్‌కు జట్టుకు భారత్ చేతిలో పరాభావం ఎదురైంది. లీగ్ స్టేజి, సూపర్-4లో టీమిండియాపై ఓటమి చవిచూసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు ఫైనల్లో కూడా భంగపాటు తప్పలేదు.ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ ఆటగాళ్లు జీర్ణించుకులేకపొతున్నారు. అంతకుతోడు భారత ఆటగాళ్లు కనీసం కరచాలనం చేయకపోవడం, ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలలో వారితో కలిసి పాల్గోకపోవడంతో దాయాది ఆటగాళ్లు ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.ఫైనల్ మ్యాచ్ ముగిసినంతరం ఏసీసీ ఛీప్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకు సిద్దంగా ఉన్నప్పటికి భారత ఆటగాళ్లు మాత్రం వేదిక దగ్గరకు కూడా రాలేదు. దీంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్‌ను తీసుకున్నారు.పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) చైర్మెన్, ఏసీసీ ప్రతినిథి ఆమినుల్ ఇస్లాం రన్నరప్ టైటిల్ అందజేశారు. అయితే ఇక్కడే సల్మాన్ అలీ ఓవరాక్షన్ చేశాడు. చెక్కు తీసుకున్న పాక్ కెప్టెన్ వెంటనే స్టేజ్ మీద నుంచి కిందకు విసిరేశాడు.అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో సల్మాన్ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్టేజిపై నుంచి కిందకు వస్తుండగా సల్మాన్‌ను భారత్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ హేళన చేశారు. దీంతో అతడు చేసేదేమి లేక నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మరి అంత పొగరు పనికిరాదు అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAK pic.twitter.com/GkEn7deKZj— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025 -
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా చేతిలో మరోసారి చావు దెబ్బ ఎదురైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడాలన్న పాక్ ఆశలపై మెన్ ఇన్ బ్లూ నీళ్లు జల్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. పెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు నాటౌట్) చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని అఘా చెప్పుకొచ్చాడు.జీర్ణించుకోలేక పోతున్నాం.."ఈ ఓటమిని మేం జీర్ణించుకోలేక పోతున్నాం. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాము. మాకు మంచి ఆరంభం లభించినప్పటికి భారీ స్కోర్ సాధించలేకపోయాము. బౌలింగ్‌లో మాత్రం మేము అద్భుతంగా రాణించాము. ఆఖరి వరకు గెలిచేందుకు అన్ని విధాలగా మేము ప్రయత్నించాము.బ్యాటింగ్‌లో మంచి ఫినిషింగ్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది. స్ట్రయిక్‌ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాం. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే మేము అనుకున్న స్కోర్ చేయలేకపోయాము. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము.మా బ్యాటింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటాము. భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆఖరి 6 ఓవర్లలో భారత విజయానికి 63 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మాకు గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని భావించాను.కానీ దురదృష్టవశాత్తూ ఓటమి చవి చూశాము. అయితే మా బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి సవాల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము.మేము బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం మాకు ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌ను భారత్ బహిష్కరిచింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది.చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్ -
Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత, పాకిస్తాన్ (India vs Pakistan) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. టాస్ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడేందుకు ఇద్దరు ప్రతినిధులు ఏర్పాటు చేయబడ్డారు.సాధారణంగా ఏ మ్యాచ్‌కైనా టాస్ సమయంలో ఒకరే ప్రతినిధి ఇద్దరు కెప్టెన్లతో మాట్లాడతాడు. అయితా ఈసారి అలా కాకుండా పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్‌తో ఒకరు, భారత కెప్టెన్‌తో మరొకరు మాట్లాడేందుకు ఏర్పాటు చేయబడ్డాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో భారత్‌కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో అదే దేశానికి చెందిన వకార్ యూనిస్ సంభాషించాడు.టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాక్ కెప్టెన్‌తో హ్యాండ్ షేక్‌కు దూరంగా ఉన్నాడు. టాస్ సమయంలో ఇద్దరు ప్రతినిధుల ఐడియాను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తున్న టీమిండియా సాధారణంగా బౌలింగ్ చేస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేతో బౌలింగ్ అటాక్‌ను ప్రారంభించాడు. అతను 2 ఓవర్లలో 12 పరుగులకే ఇచ్చి పర్వాలేదనిపించాడు. బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో ఓవర్ వేశారు.6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 45/0గా ఉంది. ఫర్హాన్ 31, ఫకర్ జమాన్ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, భారత్, పాకిస్తాన్ 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ మ్యాచ్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత టోర్నీలో భారత్, పాక్ ఇప్పటికే రెండు సార్లు తలపడగా.. రెండు సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు -
ఆసియా కప్ 2025 విజేత టీమిండియా
ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ మరో 2 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ (69) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్తిలక్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్డాను. 16 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 24 బంతుల్లో 36 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా12.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఫర్హాన్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (24) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న తిలక్, శాంసన్20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో భారత బ్యాటర్లు తిలక్ వర్మ (24), సంజూ శాంసన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 58/3గా ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతుంది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ (12) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో హరీస్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కష్టాల్లో టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కష్టాల్లో పడింది. 10 పరుగులకే ఇన్ ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. చెలరేగిన కుల్దీప్.. 146 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చెలరేగిన కుల్దీప్ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికి సల్మాన్ అఘా, నాలుగో బంతికి షాహీన్ అఫ్రిది (0), ఆఖరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ (0) ఔటయ్యారు. 16 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 134/8గా ఉంది. నవాజ్, హరీస్ రౌఫ్ క్రీజ్‌లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన పాక్16.1వ ఓవర్- 133 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సల్మాన్ అఘా (8) ఔటయ్యాడు. కష్టాల్లో పాకిస్తాన్పాక్ జట్టు మరోసారి కష్టాలో పడింది. తొలుత పరుగు వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఈసారి 5 పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 15.3 ఓవర్లలో 132 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా (7), మొహమ్మద్ నవాజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 118/3పరుగు వ్యవధిలో రెండు వికెట్లు (సైమ్ అయూబ్ (14), మొహమ్మద్ హరీస్ (0)) కోల్పోవడంతతో పాక్ స్కోర్ నెమ్మదించింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 118/3గా ఉంది. ఫకర్ జమాన్ (38), సల్మాన్ అఘా (3) క్రీజ్‌లో ఉన్నారు. 100 పరుగులు పూర్తి చేసుకున్న పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 11.2 ఓవర్లలోనే 100 పరుగులు (వికెట్ నష్టానికి) పూర్తి చేసుకుంది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 107/1గా ఉంది. ఫకర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్9.4వ ఓవర్- 84 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సాహిబ్జాదా ఫర్హాన్ (57) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ పెవిలియన్‌కు చేరాడు. ధాటిగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు.. ఫర్హాన్ హాఫ్ సెంచరీతొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాహిబ్జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 18 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 77/0గా ఉంది. జాగ్రత్తగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (6) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 32/0గా ఉంది.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. అతని స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ మిస్ అయిన శివమ్ దూబే, బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
అది సూర్యకుమార్ ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో లీగ్, సూపర్-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. తొలుత గ్రూప్-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్.. తర్వాత సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అయితే, సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్‌కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.ఫొటోషూట్‌కు వెళ్లని సూర్యఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్‌కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.అది సూర్యకుమార్ ఇష్టంఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు.గెలిచేది మేమేఇక టైటిల్ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్‌లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్‌లు గెలవలేకపోయాము.తక్కువ తప్పులు చేసిన వారిదే విజయంఅయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా పాక్‌తో ఫైనల్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్ ఫిట్‌గానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేననే టైటిల్ ఫేవరెట్ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
IND vs PAK: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి టైటిల్ పోరులో దాయాదులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-4కు చేరింది టీమిండియా.అదే విధంగా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో గెలిచి అజేయంగా ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మరోవైపు.. పాకిస్తాన్ లీగ్ దశలో యూఏఈ, ఒమన్‌లపై గెలిచి సూపర్-4 చేరగలిగింది.పాకిస్తాన్ బలహీనంగానేతర్వాత సూపర్-4లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లలో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. తమ చివరి సూపర్–4 మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌తో దాదాపు ఓటమికి చేరువై అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగింది. ఇక భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా టీమ్ ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్‌గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్‌లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. సయీమ్ విఫలమైనా.. జట్టులోనేఫఖర్ జమాన్ (Fakhar Zaman) తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా... మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసింది 64 పరుగులే. ‘పాక్ అభిషేక్ శర్మ’ అంటూ కొన్నాళ్ల క్రితం కీర్తించిన సయీమ్ అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్లతో ఘోర ప్రదర్శన కనబర్చాడు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిలార్డర్లో తలత్, హారిస్‌లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో షాహిన్ అఫ్రిది ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించినా... భారత్ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. రవూఫ్, అబ్రార్, ఫహీమ్, నవాజ్ మన బ్యాటర్లనను అడ్డుకోవడం అంత సులువు కాదు.పిచ్, వాతావరణం దుబాయ్‌లో సాధారణ వికెట్. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌కు కూడా అనుకూలం. అయితే రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం ముఖాముఖి పోరులో..భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే, టీ20లు కలిపి ఇప్పటి వరకు పన్నెండు ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ నాలుగు గెలవగా... పాకిస్తాన్ ఎనిమిది ఫైనల్లలో విజయం సాధించింది.తుదిజట్ల వివరాలు అంచనా:టీమిండియా:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీమ్ అయూబ్, హొసేన్ తలత్, మొహమ్మద్ హ్యారిస్, షాహిన్ అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్. చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. మా ఫీల్డింగ్ సూపర్: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థిగా పాకిస్తాన్ ఖరారైంది. దుబాయ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కిన పాక్.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబరు 28) భారత జట్టుతో ఫైనల్లో (IND vs PAK In Final) తలపడేందుకు సిద్ధపడింది.135 పరుగులుకాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఫఖర్ జమాన్ (13) నిరాశపరచగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) 19 పరుగులు చేయగా.. హుసేన్ తలట్ 3 పరుగులకే నిష్క్రమించాడు.Mustafizur Rahman sends the Pakistan captain packing 💨☝️Watch #PAKvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/bkPfVMxULa— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ 23 బంతుల్లో 31, మొహమ్మద్ నవాజ్ 15 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరికి తోడుగా పేసర్ షాహిన్ ఆఫ్రిది 13 బంతుల్లో 19 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది.రాణించిన పాక్ బౌలర్లుబంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా... మెహదీ హసన్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 124 పరుగులే చేసింది. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోరు దాటాడు.పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లు కూల్చి సత్తా చాటగా.. సయీమ్ ఆయుబ్ రెండు, మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టారు.అతడి బౌలింగ్ అద్భుతంఇక బంగ్లాదేశ్‌పై విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. తాము ఆదివారం నాటి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.‘‘ఇలాంటి మ్యాచ్‌లలో గెలిచామంటే మేమొక ప్రత్యేక జట్టు అనే చెప్పవచ్చు. మా జట్టులోని ప్రతి ఒక్కరు మెరుగ్గా ఆడారు. అయితే, బ్యాటింగ్ విభాగంలో మేము మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ దిశగా మేము ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నాము కూడా!షాహిన్ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఏదేమైనా మేము ఇంకో 15 పరుగులు చేసి ఉంటే విజయం సులభమయ్యేది.ఏ జట్టునైనా ఓడించగలముఅయితే, మా బౌలర్లు గొప్పగా రాణించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనుకున్న ఫలితం రాబట్టారు. ఇక మేము అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. మా కోచ్ కఠినంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎక్స్ట్రా సెషన్స్ పెడుతున్నారు.హెడ్‌కోచ్ మైక్ హసన్.. ‘ఫీల్డింగ్ చేస్తేనే మీకు జట్టులో స్థానం ఉంటుంది’ అని చెప్పాడు. ఫీల్డింగ్ విషయంలో మా వాళ్లు అంత కఠినంగా ఉంటున్నారు. మా జట్టు ప్రస్తుతం గొప్పగా ఉంది. మేము ఏ జట్టునైనా ఓడించగలము. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇది చేసి చూపించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాపై నామ మాత్రపు గెలుపు సాధించినందుకే ఇంత అతి వద్దంటూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చే స్తున్నారు.టీమిండియా చెత్త ఫీల్డింగ్కాగా లీగ్ దశలో అజేయంగా ఉండి సూపర్-4 చేరిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ చేరింది. అయితే, ఆసియా కప్ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా.. ఏకంగా 12 క్యాచ్‌లు డ్రాప్ చేసింది. మరోవైపు.. పాక్ కేవలం నాలుగు క్యాచ్‌లు మాత్రమే నేలపాలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న సూర్యసేన.. ఫీల్డింగ్ తప్పిదాలు సరిచేసుకుంటేనే విజయం నల్లేరు మీద నడక అవుతుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్ -
‘అతడికి అసలు ఆ అర్హత ఉందా?.. ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసా?’
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మండిపడ్డాడు. సల్మాన్ జట్టుకు బలహీనతగా మారాడని.. తనేం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కోచ్ మైక్ హసన్ నిర్ణయం చెత్తగా ఉందంటూ అక్తర్ విమర్శించాడు.ఆసియా కప్-2025 టీ20 టోర్నమెంట్లో భారత్ చేతిలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో సూర్యకుమార్ సేన చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు...దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58)తో రాణిచంగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. భారత్ ఏడు బంతులు మిగిలి ఉండగానే పాక్ విధించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా బ్యాటింగ్ స్థానంలో ఆరో ఆటగాడిగా రావడం పట్ల అక్తర్ స్పందించాడు.అతడికి అసలు ఆ అర్హత ఉందా?‘‘జట్టులో బలహీనమైన లింక్ ఏదైనా ఉందంటే.. సల్మాన్ ఆఘానే. అసలు అతడు ఆరోస్థానంలో ఆడేందుకు అర్హుడా? మిడిలార్డర్లో వీకెస్ట్ లింక్. అతడు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీమిండియాతో మ్యాచ్‌లో డౌన్లో వస్తాడా? హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి వాళ్లు భారత జట్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారా?.. ప్రత్యర్థి జట్టుతో కనీసం పోలికైనా అక్కర్లేదా?కోచ్ చెప్పిన మాట వినడం మంచిదే. కానీ దాని వల్ల ఉపయోగం లేనపుడు ఎందుకు అలా చేయడం?.. కోచ్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్‌గా తనేం చేస్తున్నాడో అసలు సల్మాన్కైనా తెలుసా?’’ అంటూ అక్తర్ ఫైర్ అయ్యాడు. కాగా ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో చావో రేవో తేల్చుకోనుంది. అబుదాబి ఇందుకు వేదిక.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్‌బై చెప్పేసి.. -
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్‌లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్‌లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్‌లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. యూఏఈ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి ఎట్టకేలకు గట్టెక్కిన పాక్.. మరోసారి టీమిండియతో తలపడేందుకు సిద్ధమైంది.దుబాయ్ వేదికగా సెప్టెంబరు 21న పాకిస్తాన్.. టీమిండియా (Ind vs Pak)ను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో యూఏఈపై విజయానంతరం పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha).. తాము ఏ జట్టునైనా ఓడించగలమంటూ కాస్త అతిగా మాట్లాడాడు. ‘‘మేము ఈ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాము. అయితే, మధ్య ఓవర్లలో ఇంకాస్త శ్రమించాల్సింది.అబ్రార్ అహ్మద్ అత్యద్భుతంఏదైమైనా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ బ్యాటింగ్ పరంగానే మేము నిరాశకు లోనయ్యాం. ఇప్పటి వరకు మా అత్యుత్తమ స్థాయి ప్రదర్శనను కనబరచలేకపోయాం. ఒకవేళ ఈరోజు మేము మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. 170-180 పరుగులు సాధించేవాళ్లం.షాహిన్ ఆఫ్రిది మ్యాచ్ విన్నర్. అతడి బ్యాటింగ్ కూడా మెరుగుపడింది. ఇక అబ్రార్ అహ్మద్ (2/13) అత్యద్భుతంగా రాణించాడు. చేజారే మ్యాచ్‌లను మావైపు తిప్పడంలో అతడు ఎల్లప్పుడూ ముందే ఉంటాడు.ఎలాంటి జట్టునైనా ఓడించగలముమున్ముందు ఎదురయ్యే ఎలాంటి సవాలుకైనా మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఇలాగే గొప్పగా ఆడితే.. ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. పరోక్షంగా టీమిండియాను ఉద్దేశించి.. తాము సూపర్-4 పోరుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాడు.నాటకీయ పరిణామాల నడుమకాగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడ్డాయి. ఈ క్రమంలో యూఏఈ, పాక్‌లను ఓడించి టీమిండియా తొలుత సూపర్ ఫోర్కు అర్హత సాధించగా.. ఒమన్ ఎలిమినేట్ అయింది. అయితే, గ్రూప్-ఎ నుంచి మరో బెర్తు కోసం పాక్- యూఏఈ బుధవారం రాత్రి తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో గెలిచి.. తమ బెర్తును ఖరారు చేసుకోగా.. యూఏఈ ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే.. టీమిండియా చేతిలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోని భారత జట్టు.. మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా కరచాలనానికి నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో పాటు తాము బాయ్‌కాట్ చేస్తామంటూ రచ్చచేసింది. అయితే, ఆఖరికి పాక్ తలొగ్గక తప్పలేదు. యూఏఈతో మ్యాచ్‌కు గంట కావాలనే ఆలస్యం చేసినా.. చివరకు మళ్లీ మైదానంలో అడుగుపెట్టింది.పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ స్కోర్లుటాస్: యూఏఈ.. తొలుత బౌలింగ్పాక్ స్కోరు: 146/9 (20)యూఏఈ స్కోరు: (17.4)ఫలితం: యూఏఈపై 41 పరుగుల తేడాతో పాక్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాహిన్ ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్.. మూడు ఓవర్ల బౌలింగ్‌లో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు).చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
మా ఐన్‌స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
ఆసియాకప్-2025లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్‌లో దుమ్ములేపిన టీమిండియా దాయాది పాక్‌ను చావుదెబ్బ కొట్టింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఒకవైపు ఓటమి, మరోవైపు భారత్ చేసిన పనికి పాక్ మాజీ ఆటగాళ్లు ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఆ జట్టు మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. సల్మాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు."టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండే అవకాశముందని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అతడు అంచనా వేశాడు. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్‌గా ఉంది.మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం అని సూర్య స్పష్టంగా చెప్పాడు. కానీ మా ఐన్‌స్టీన్ (సల్మాన్ అలీ ఆఘా) మాత్రం పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండానే మేం మొదట బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. అందుకు తగ్గ మూల్యం పాక్ చెల్లించుకుందని" అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్ ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వడంపై కూడా అక్తర్ స్పందించాడు. "నాకు మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది. గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము. మేము ఈ నో షేక్ హ్యాండ్ చర్య గురించి మాట్లాడొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మరచిపోయి ముందుకు సాగిపోవాలి" అని అక్తర్ అన్నాడు.చదవండి: పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ -
‘అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అందుకే మా కెప్టెన్ ఇలా’
టీమిండియా చేతిలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)కు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్ టీ20 టోర్నీ-2025లో భాగంగా భారత్ చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరుదేశాలు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో తీవ్రమైన భావోద్వేగాల వ్యక్తీకరణల నడుమ భారత్- పాక్ మైదానంలో దిగాయి. ‘బాయ్‌కాట్’ ట్రెండ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryalumar Yadav) ముందుగానే జాగ్రత్తపడ్డాడు. టాస్ సమయంలో పాక్ సారథి సల్మాన్ ఆఘా (Salman Agha)కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది.అక్కడికి వెళ్లినా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు..ఈ క్రమంలో అవమానభారంతో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌కు కూడా రాలేదు. ఈ విషయంపై పాక్ కోచ్ మైక్ హసన్ వివరణ ఇచ్చాడు. ‘‘ఏదో ఫ్లోలో అలా జరిగిపోయి ఉంటుందని అనుకున్నాం. వారితో కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మా ప్రత్యర్థి జట్టు చేసిన పని మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది.ఆ తర్వాత కూడా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాము. కానీ వాళ్లు అప్పటికే చేంజింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. నిజంగానే మేము కరచాలనానికి సిద్ధంగా ఉన్నా ఇలా జరగడం బాధ కలిగించింది’’ అని మైక్ హసన్ మీడియాతో పేర్కొన్నాడు.ఆడుతూ.. పాడుతూ.. అలవోకగా..కాగా దుబాయ్ వేదికగా భారత- పాక్ ఆదివారం తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40), పేసర్ షాహిన్ ఆఫ్రిది (33) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్ల ఆటలో తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు చెరో ఒక వికెట్ దక్కింది.ఇక లక్ష్య ఛేదనను టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. 15.4 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. ఫలితంగా దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. పాక్ స్పెషలిస్టు బౌలర్లంతా విఫలం కాగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: పాక్ జట్టుకు ఘోర అవమానం!?.. అలాంటివాళ్లకు గంభీర్ కరెక్ట్! Trick after trick, Pakistan fell for Kuldeep's magic show 🪄Watch the #DPWorldAsiaCup2025, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/F5lOWqPrvK— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
Asia Cup 2025: నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సల్మాన్ అలీ విఫలమయ్యాడు. ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన సల్మాన్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్‌తో మ్యాచ్‌లో కూడా పేలవ ప్రదర్శన కనబరిచాడు.కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొలి బంతి నుంచే భారత స్పిన్నర్లను ఎదుర్కొవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఆఖరికి 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులు చేసిన సల్మాన్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడి వికెట్ పాక్ మరింత ఒత్తిడిలో కూరుకుపోయింది.దీంతో కెప్టెన్‌గా దారుణ ప్రదర్శన కనబరుస్తున్న అలీ అఘాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిన్ను ఎవరు భయ్యా కెప్టెన్ చేశారు? అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మహ్మద్ రిజ్వాన్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన సల్మాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. కెప్టెన్‌గా ఒకట్రెండు సిరీస్‌లు గెలిపించినప్పటికి ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పాక్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.SALMAN ALI AGHA IN T20Is4(2) – 0(1) – 1(9) – 13(19) – 32(32)5 innings, 50 runs, 10 avg, 79 SR. pic.twitter.com/6rgh4P6ZlA— junaiz (@dhillow_) March 4, 2025ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. -
IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్‌లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్నాయి.మేము గొప్పగా ఆడుతున్నాముఇక భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.ఇది కాస్త స్లో వికెట్లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్‌లు కొత్తేం కాదు.తొలుత బౌలింగ్ చేయాలనే భావించాంఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
Asia Cup 2025: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
India vs Pakistan Match live updates: దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సర్‌తో 47 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), తిలక్ శర్మ(31) రాణించారు. పాక్ బౌలర్లలో అయూబ్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది.తిలక్ ఔట్..తిలక్ వర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన తిలక్ వర్మ.. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. భారత విజయానికి ఇంకా 31 పరుగులు కావాలి. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఉన్నారు.నిలకడగా ఆడుతున్న సూర్య, తిలక్..8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(19), సూర్యకుమార్ (9) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 57 పరుగులు కావాలి.రెండో వికెట్ కోల్పోయిన భారత్..అభిషేక్ శర్మ రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 42/1. క్రీజులో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.భారత్ తొలి వికెట్ డౌన్.. గిల్ ఔట్128 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్.. సైమ్ అయూబ్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు భారత్ స్కోర్: 22/1. అభిషేక్ శర్మ (5 బంతుల్లో 12) దూకుడుగా ఆడుతున్నాడు.టీమిండియా టార్గెట్@128దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. షాహిన్ అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 33) ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు.తొమ్మిదో వికెట్ డౌన్..పాకిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సోఫియన్ ముఖియమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.పాక్ ఎనిమిదో వికెట్ డౌన్..పాకిస్తాన్‌కు ఆలౌట్‌కు చేరువైంది. ఫహీం అష్రఫ్(11) రూపంలో పాక్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అష్రప్ ఔటయ్యాడు. 18 ఓవర్లకు పాక్ స్కోర్: 99/8. క్రీజులో షాహీన్ అఫ్రిది(15), ముఖియమ్(1) ఉన్నారు.పాక్ ఏడో వికెట్ డౌన్..సాహిబ్జాదా ఫర్హాన్ రూపంలో పాకిస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఫర్హాన్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కుల్దీప్కు ఇది మూడో వికెట్. 16.1 ఓవర్లకు పాక్ స్కోర్: 83/712.5: ఆరో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ మహ్మద్ నవాజ్‌ను డకౌట్ చేశాడు. వికెట్ల ముందు దొరకబుచ్చుకుని వచ్చీ రాగానే పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. స్కోరు: 65/6 (13).12.4: ఐదో వికెట్ కోల్పోయిన పాక్కుల్దీప్ యాదవ్ బౌలింగ్ హసన్ నవాజ్ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. సాహిబ్జాదా 32, నవాజ్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 64/5 (12.4).నాలుగో వికెట్ కోల్పోయిన పాక్9.6: అక్షర్ పటేల్ మరోసారి అదరగొట్టాడు. అద్భుతమైన బంతితో సల్మాన్ ఆఘా (3)ను పెవిలియన్‌కు పంపాడు. అక్షర్ బౌలింగ్‌లో సల్మాన్ ఇచ్చిన బంతిని అభిషేక్ శర్మ క్యాచ్ పట్టడంతో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కోరు: 49/4 (10). సల్మాన్ స్థానంలో హసన్ నవాజ్ క్రీజులోకి రాగా.. సాహిబ్జాదా 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. Axar Patel joins the party 🥳Fakhar Zaman departs for just 17.Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xwkBnHbnqr— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 మూడో వికెట్ కోల్పోయిన పాక్7.4: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫఖర్ జమాన్ (17) అవుటయ్యాడు. జమాన్ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ వర్మ అద్భుత రీతిలో పట్టడంతో.. పాక్ మూడో వికెట్ కోల్పోయింది. పాక్ స్కోరు: 45/3 (7.4) పవర్ ప్లేలో పాకిస్తాన్ స్కోరు: 42/2 (6)సాహిబ్జాదా 19, ఫఖర్ జమాన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారుమూడు ఓవర్ల ఆట ముగిసే సరికి పాకిస్తాన్ స్కోరు: 20/2సాహిబ్జాదా మూడు, ఫఖర్ జమాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన పాక్1.2: బుమ్రా బౌలింగ్‌లో రెండో వికెట్‌గా వెనుదిరిగిన మహ్మద్ హ్యారిస్. మూడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి హ్యారిస్ అవుటయ్యాడు. పాక్ స్కోరు: 6/2 (1.2)తొలి వికెట్ కోల్పోయిన పాక్..0.1: పాకిస్తాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సైమ్ అయూబ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరి ఫాస్ట్ బౌలర్లలతో మెన్ ఈన్ గ్రీన్ బరిలోకి దిగింది. స్పీడ్ స్టార్ హరిస్ రౌఫ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులు లేకుండా ఆడుతోంది. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ను సాధించాడు. దీంతో గిల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ స్పిన్నర్లగా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా ఫ్రంట్ లైన్ పేసర్‌గా ఉన్నాడు. బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బంతిని పంచుకోనున్నారు.తుది జట్లుభారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్ -
Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్‌లో పసికూన ఒమన్‌ను ఎదుర్కొన్న సల్మాన్ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుబ్ డకౌట్.. హ్యారిస్ అర్ధ శతకంఓపెనర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది.హ్యారిస్‌తో పాటు ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23 నాటౌట్) రాణించగా.. నవాజ్ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 67 పరుగులకే ఆలౌట్ చేసిఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్‌ను పాక్ 67 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్.. పేసర్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది (పేసర్), అబ్రార్ అహ్మద్ (స్పిన్నర్), మొహమ్మద్ నవాజ్ (స్పిన్నర్) తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఒమన్ బ్యాటర్లలో హమావ్ మీర్జా 27 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఒమన్‌పై విజయానంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.స్పిన్నర్లు కీలకం‘‘బ్యాటింగ్‌పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్ కూడా ఉన్నాడు.దుబాయ్, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్‌లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.ఎలాంటి జట్టునైనా ఓడించగలమునిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్ ఆడాము. అలవోకగానే సిరీస్‌ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్ ఒమన్‌పై గెలిచింది. అయితే, నెట్ రన్‌రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్ (+10.483) ప్రస్తుతం గ్రూప్-‘ఎ’ టాపర్‌గా ఉండగా.. పాక్ (+4.650) రెండో స్థానంలో ఉంది.ఆసియా కప్-2025: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉పాకిస్తాన్- 160/7 (20)👉ఒమన్- 67 (16.4)👉ఫలితం: ఒమన్‌పై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్‌గా సాల్ట్ చరిత్ర -
టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్!?
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. శుక్రవారం (సెప్టెంబర్12) దుబాయ్ వేదికగా ఒమన్‌తో పాక్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు స్వల్ప గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.దీంతో బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు అతడు దూరంగా ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్లో సల్మాన్ ఆఘా నెక్ బ్యాండ్‌తో కన్పించినట్లు సమాచారం. జట్టుతో పాటు ఐసీసీ ఆకాడమీకి వెళ్లినప్పటికి అతడు ఎటువంటి ప్రాక్టీస్‌లోనూ పాల్గోలేదంట. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమ కెప్టెన్ గాయం బారిన పడడంతో పాకిస్తాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే ముందుస్తు జాగ్రత్తలో భాగంగానే అతడి విశ్రాంతికి ఇచ్చినట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడు ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఒమన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అఘా దూరమైనా.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముంది. అప్పటికి అతడి గాయం తీవ్రమై భారత్ మ్యాచ్‌కు దూరమైతే పాక్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి.కాగా పాకిస్తాన్ దాదాపు రెండు వారాల ముందే యూఏఈకు చేరుకుంది. ఆసియాకప్ టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా అఫ్గానిస్తాన్-యూఏఈలతో ట్రైసిరీస్‌లో పాక్ తలపడింది. ఫైనల్లో అఫ్గాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను పాక్ సొంతం చేసుకుంది. అదే జోరును ఇప్పుడు ఆసియాకప్‌లోనూ కొనసాగించాలని మెన్ ఇన్ గ్రీన్ పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఆసియాకప్‌కు పాక్ జట్టుసల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోకిమ్చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు' -
మైదానంలో వాళ్లను ఆపను.. ఈసారి ఫేవరెట్ జట్టు ఏదీ లేదు: పాక్ కెప్టెన్
పొట్టి క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచేందుకు ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ సిద్ధంగా ఉంది. అఫ్గనిస్తాన్- హాంకాంగ్ (AFG vs HK) మ్యాచ్‌తో మంగళవారం (సెప్టెంబరు 9) ఈ మెగా ఈవెంట్‌కు తెరలేస్తుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)తో పాటు.. రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్), చరిత్ అసలంక (శ్రీలంక), లిటన్ దాస్ (బంగ్లాదేశ్), సల్మాన్ ఆఘా (పాకిస్తాన్), జతీందర్ సింగ్ (ఒమన్), ముహమ్మద్ వసీం (యూఏఈ), యాసిమ్ ముర్తాజా (హాంకాంగ్) విలేకరులతో ముచ్చటించారు.హుందాగా బదులిచ్చిన సూర్యఈ క్రమంలో ఆసియా కప్ తాజా ఎడిషన్ టోర్నీ విజేతగా టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్న వచ్చింది. ఇందుకు సూర్య తనదైన శైలిలో హుందాగా సమాధానమిచ్చాడు. ‘‘మీకెవరు ఈ విషయం చెప్పారు?.. నేనైతే ఎప్పుడూ వినలేదు.అయితే, సుదీర్ఘకాలంగా మేము టీ20 క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాం. ఇప్పుడు కూడా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము’’ అని సూర్య తెలిపాడు. ఇక ఇదే ప్రశ్నకు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది.షాకింగ్‌గా సల్మాన్ సమాధానంటీమిండియాను ఫేవరెట్‌గా భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘టీ20 క్రికెట్లో గంట.. రెండు గంటల సమయంలోనే అంతా తలకిందులైపోతాయి. మ్యాచ్ రోజు ఎవరైతే గొప్పగా ఆడతారో వారిదే విజయం. అందుకే ఈ ఫార్మాట్ టోర్నీలో ఓ జట్టు ఫేవరెట్‌గా ఉంటుందని నేను అనుకోను’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.మైదానంలో వాళ్లను ఆపనుఇక మైదానంలో ఫాస్ట్‌బౌలర్లను కట్టడి చేస్తారా అని విలేకరులు అడుగగా.. ‘‘ఫాస్ట్ బౌలర్లు అంటేనే దూకుడుగా ఉంటారు. వారిని దాని నుంచి మనం వేరుచేయలేము. ఎవరైతే మైదానంలో అగ్రెసివ్ ఉండాలనుకుంటారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.క్రీడా స్ఫూర్తికి భంగం కలగనంత వరకు స్వేచ్ఛ కొనసాగుతుంది. నా వైపు నుంచైతే ఫాస్ట్‌బౌలర్లపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు’’ అని సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.కాగా ఆసియా కప్-2025 టోర్నీకి ముందు పాకిస్తాన్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌లతో ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఇందులో యూఏఈ, అఫ్గన్లపై వరుస విజయాలతో ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో రషీద్ ఖాన్ బృందాన్ని ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది.టీమిండియాదే హవాఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో ఆది నుంచీ టీమిండియాదే హవా. ఇప్పటికి ఎనిమిది సార్లు భారత్ టైటిల్ గెలవగా.. శ్రీలంక ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకోగలిగింది. ఇక ఈసారి దాయాదులు భారత్- పాక్ సెప్టెంబరు 14న ముఖాముఖి తలపడనున్నాయి.చదవండి: ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే? -
ముందుగానే స్టేజీ దిగిపోయిన పాక్ కెప్టెన్.. సూర్య, రషీద్ ఖాన్ ఏం చేశారంటే?
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ గురించే చర్చ. ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో (2023 వన్డే ఫార్మాట్ విజేత ) టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. టీ20 ఫార్మాట్లో గత చాంపియన్‌గా శ్రీలంక పోటీలో ఉంది.ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్.. యూఏఈ వేదికగా ఆతిథ్యం ఇస్తోంది. ఇందులో గ్రూప్-‘ఎ’ నుంచి టీమిండియాతో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీలో ఉన్నాయి. ఇక గ్రూప్- ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీపడుతున్నాయి.కెప్టెన్ల మీడియా సమావేశంఇక సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుండగా.. మంగళవారం ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి టీమిండియా- పాకిస్తాన్ కెప్టెన్లపైనే కేంద్రీకృతమైంది.సూర్య - సల్మాన్ మధ్యలో రషీద్భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ ప్రెస్మీట్లో అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పక్కన కూర్చున్నాడు. ఇక పాక్ జట్టు నాయకుడు సల్మాన్ ఆఘా రషీద్‌కు మరోవైపు కూర్చున్నాడు. విలేకరులతో మాట్లాడిన అనంతరం సల్మాన్ ఆఘా.. హాంకాంగ్, ఒమన్ కెప్టెన్లతో కలిసి ముందుగానే వేదిక దిగిపోయాడు.సారథుల ఆలింగనం.. పాక్ కెప్టెన్ మిస్ఇంతలో రషీద్- సూర్యతో మాట్లాడుతూ నవ్వులు చిందించగా.. యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం వచ్చి ఒక్కొక్కరిగా వేదికపై ఉన్న జట్ల సారథులను ఆలింగనం చేసుకుని కరచాలనం చేశాడు. ఈ క్రమంలో సూర్య, రషీద్ శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక, బంగ్లా సారథి లిటన్ దాస్‌లకు షేక్‌హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు.ఆ తర్వాత..ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి రాగా.. టీమిండియా- పాకిస్తాన్ కెప్టెన్లు దూరం దూరంగానే ఉన్న వార్త ప్రచారం అయింది. అయితే, ఇంకో వీడియోలో మిగతా కెప్టెన్లతో పాటు సల్మాన్‌కు కూడా సూర్య షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లు కనిపించింది.కేంద్రం అనుమతితోనే..కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాలు భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో క్రీడల్లోనూ అన్ని స్థాయిల్లోనూ పాకిస్తాన్‌తో బంధం తెంచుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియా కప్ మల్టీలేటరల్ టోర్నీ కావున చిరకాల ప్రత్యర్థితో టీమిండియా మ్యాచ్ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం గమనార్హం.ఇక ప్రెస్మీట్లో అంటీముట్టనట్టుగానే ఉన్న భారత్- పాక్ జట్ల సారథులు ఆఖర్లో కర్టసీగా కరచాలనం చేసుకోవడం నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనున్న సూర్యకుమార్ సేన.. 14న దాయాది పాక్‌తో తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరిగా సెప్టెంబరు 19న ఒమన్‌తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలుIndian Captain Suryakumar Yadav and Pakistan Captain Salman Agha..(This video is for those saying that the Pakistan captain wasn't sitting next to the Indian players and they didn’t even shake hands)pic.twitter.com/76CSDcJIQW— Sporttify (@sporttify) September 9, 2025 -
వారిద్దరిని మిస్ అవ్వడం లేదు..అన్నింటికీ మేము రెడీ: పాక్ కెప్టెన్
ఆసియాకప్-2025కు రంగం సిద్దమైంది. అబుదాబి వేదికగా మరి కొన్ని గంటల్లో అఫ్గానిస్తాన్-యూఏఈ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నమెంట్ ఆరంభానికి ముందు మొత్తం 8 జట్ల కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టులో లేకపోవడం తమకు ఎటువంటి నష్టం కలిగించదు సల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొంత కాలంగా బాబర్, రిజ్వాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసియాకప్‌కు సెలక్టర్లు చేయలేదు. సెలక్టర్ల నిర్ణయాన్ని చాలా మంది తప్పు బట్టారు. కాగా ఇటీవల కాలంలో పాక్ ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకుండా ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి"ప్రస్తుతం మా జట్టు చాలా బాగుంది. గత నాలుగు సిరీస్‌లలో మేము మూడింట మేము విజయం సాధించాము. అన్ని విభాగాల్లోనూ మేము మెరుగ్గా రాణిస్తున్నాము. ఏదేమైనప్పటికి ఆసియాకప్ మాకు ఒక కఠిన సవాల్ వంటిది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఒక ప్రధాన టోర్నమెంట్లో ఆడనున్నారు.ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నాము. టీ20 క్రికెట్లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. తమదైన రోజున ప్రతీ జట్టు అద్బుతాలు చేస్తోంది. ఒకట్రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఈ టోర్నీకి ముందు ముక్కోణపు సిరీస్‌ను మేము సన్నాహకంగా ఉపయోగించుకున్నాము.సిరీస్‌ను గెలిచినందుకు సంతోషంగా ఉన్నాము" అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ మల్టీనేషన్ టోర్నమెంట్‌కు ముందు పాక్ జట్టు యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో ట్రైసిరీస్‌లో తలపడింది. ఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి పాక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఇప్పుడు అదే జోరును ఆసియాకప్‌లోనూ కనబరిచాలని మెన్ ఈన్ గ్రీన్ భావిస్తుంది. ఈ ఖండాంత టోర్నీలో పాక్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 12న ఒమన్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న టీమిండియాతో అమీతుమీ తెల్చుకోనుంది.పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్ -
మెరిసిన సల్మాన్, రవూఫ్
షార్జా: ఆసియాకప్ టి20 టోర్నమెంట్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ముక్కోణపు టోర్నీలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 39 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిరీ్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెపె్టన్ సల్మాన్ ఆగా (36 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్ (21; 1 ఫోర్, 2 సిక్స్‌లు), ఫఖర్ జమాన్ (20; 1 ఫోర్, 1 సిక్స్), మొహమ్మద్ నవాజ్ (21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా, ముజీబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రషీద్ ఖాన్ (16 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... రహా్మనుల్లా గుర్బాజ్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) కాస్తా పోరాడాడు. మొహమ్మద్ నబీ (3), అజ్మతుల్లా (0), కరీమ్ జనత్ (0), ఇబ్రహీమ్ జద్రాన్ (9) విఫలమవడంతో అఫ్గాన్‌కు పరాజయం తప్పలేదు. ఒక దశలో 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును రషీద్ ఆదుకున్నాడు. ఎడాపెడా సిక్స్‌లు బాదుతూ ప్రత్యర్థిని భయపెట్టాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 4 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ముఖీమ్ తలా రెండు వికెట్లు తీశారు. -
రషీద్ ఖాన్ చిరునవ్వులు.. పాక్ కెప్టెన్ ముఖం మాడిపోయింది!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వంటి మెగా టోర్నమెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరలేక చతికిలపడింది. ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పరిస్థితి అంతంత మాత్రమే.సల్మాన్ ఆఘాకు పగ్గాలుఈ క్రమంలో 2024లో బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. మహ్మద్ రిజ్వాన్ పాక్ జట్టు వన్డే, టీ20 పగ్గాలు చేపట్టాడు. కానీ ఏడాదిలోపే బాబర్‌తో కలిసి టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు రిజ్వాన్. ఆసియా కప్-2025 టీ20 టోర్నీకి పాక్ బోర్డు ప్రకటించిన జట్టులోనూ వీరిద్దరికి స్థానం దక్కలేదు.టీ20 ట్రై సిరీస్ ఇక రిజ్వాన్ స్థానంలో పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సల్మాన్ ఆఘా.. చివరగా ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో 2-1తో సిరీస్ నెగ్గాడు. ఈ క్రమంలో ఆసియా టోర్నీకి సన్నాహకంగా తదుపరి యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో సల్మాన్ బృందం టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. ఆగష్టు 29- సెప్టెంబరు 7 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో యూఏఈ, అఫ్గనిస్తాన్ కెప్టెన్లతో కలిసి సల్మాన్ ఆఘా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఆసియాలో రెండో అత్యుత్తమ జట్టుగా అఫ్గనిస్తాన్ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. అఫ్గన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌కు ప్రశ్న సంధిస్తూ.. ‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆసియాలో రెండో అత్యుత్తమ క్రికెట్ జట్టుగా అఫ్గనిస్తాన్ నిలిచింది కదా!’ అని పేర్కొన్నాడు.పాపం ముఖం మాడిపోయింది!ఇందుకు ఓ వైపు రషీద్ ఖాన్ బదులిస్తుంటే.. సల్మాన్ ఆఘా ముఖం మాత్రం మాడిపోయింది. ‘‘ఇదేందయ్యా ఇది.. అబ్బో.. అటూ ఇటూ తిరిగి మావైపే విమర్శనాస్త్రాలు వచ్చేలా ఉన్నాయే’’ అన్నట్లుగా అతడి ముఖకవలికలు మారిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు.. ‘‘పాపం.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. మీకంటే అఫ్గనిస్తాన్ బెటర్ అని మీ వాళ్లే చెబుతుంటే.. ఇంతకంటే ఇంకేం చేస్తారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో అఫ్గనిస్తాన్ సంచలన విజయాలు సాధించింది.అఫ్గన్ సంచలన ప్రదర్శనఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది అఫ్గన్ జట్టు. మరోవైపు.. పాకిస్తాన్ అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి లీగ్ దశ దాటకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: Danish Malewar: డబుల్ సెంచరీతో చెలరేగిన యువ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డుAgha’s reaction when a journalist in PC called Afghanistan the second best teamin Asia 😭😭😭😭 pic.twitter.com/vKd4jQImNn— 𝐀. (@was_abdd) August 28, 2025 -
పీసీబీ తీరుపై అసంతృప్తి.. బాబర్, రిజ్వాన్ సంచలన నిర్ణయం?!
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (Babar Azam), వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్టులు వదులుకునేందుకు వారు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న బాబర్ ఆజం, రిజ్వాన్‌కు ఆ దేశ బోర్డు వరుస షాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో జరగనున్న ఆసియాకప్ టీ20 టోర్నమెంట్‌కు ఈ ఇద్దరినీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎంపిక చేయలేదు.‘బి’ కేటగిరీలో...అదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్టుల్లోనూ బాబర్, రిజ్వాన్‌లను ‘బి’ కేటగిరీకి పరిమితం చేసింది. కాగా.. 2025–26 ఏడాదికి గానూ పీసీబీ మంగళవారం సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 30 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించిన పీసీబీ... ‘ఎ’ కేటగిరీని మాత్రం ఖాళీగా వదిలేసింది. ‘బి’, ‘సి’, ‘డి’ కేటగిరీల్లో పదేసి మంది ప్లేయర్లతో జాబితా విడుదల చేసింది.‘ఈ కాంట్రాక్ట్‌లు ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు వర్తిస్తాయి. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా వీటిని కేటాయించాం. ‘ఎ’ కేటగిరీకి ఎవరూ ఎంపిక కాలేదు’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఒక్కో కేటగిరీకి ఎంత మొత్తం చెల్లిస్తున్న విషయాన్ని మాత్రం పీసీబీ వెల్లడించలేదు.వరుస వైఫల్యాలుఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు... ఈ ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, బంగ్లాదేశ్‌తో సిరీస్, వెస్టిండీస్‌తో సిరీస్‌లలో పెద్దగా ప్రభావం చూపని కారణంగా బాబర్, రిజ్వాన్‌ను ‘ఎ’ కేటగిరీ నుంచి ‘బి’కి పరిమితం చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. గతేడాది ‘సి’ కేటగిరీలో ఉన్న టీ20 కెప్టెన్ ఆఘా సల్మాన్ తాజగా ‘బి’ కేటగిరీలో చోటు దక్కించుకున్నాడు. సయీమ్ అయూబ్, హరీస్ రవుఫ్ కూడా ప్రమోషన్ దక్కించుకున్నారు. గతేడాది 27 మందికి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కగా... ఈ సారి ఆ సంఖ్యను 30కి పెంచారు.వదులుకుందాంఈ నేపథ్యంలో.. తమ పట్ల పీసీబీ వ్యవహరించిన తీరుపై బాబర్ ఆజం, రిజ్వాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ కథనం ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్టులో తమను ‘ఏ’ కేటగిరీ నుంచి తప్పించడంపై వీరిద్దరూ ఫోన్లో మెసేజ్‌ల ద్వారా సంభాషించుకున్నారు. పాక్ క్రికెట్‌కు పేరు తెచ్చిన తమను ఇంత ఘోరంగా అవమానించడమేమిటని చర్చించుకున్నారు. ఒకానొక దశలో సెంట్రల్ కాంట్రాక్టులు వదులుకోవాలని భావించారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు లేకపోయినా పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం సీనియర్లకు ఉంటుంది. చదవండి: సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా చరిత్ర -
ఎట్టకేలకు పాకిస్తాన్‌కు ఓ విజయం
బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ఇదివరకే సిరీస్ కోల్పోయిన ఆ జట్టు, ఇవాళ (జులై 24) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో కంటితుడుపు విజయం నమోదు చేసింది. ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (33), మొహమ్మద్ నవాజ్ (27), సైమ్ అయూబ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నసుమ్ అహ్మద్ 2, షొరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 16.4 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. తద్వారా సిరీస్‌లో తొలి పరాజయం ఎదుర్కొంది. టెయిలెండర్ మొహమ్మద్ సైఫుద్దీన్ అజేయమైన 35 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో సైఫుద్దీన్‌తో పాటు మొహమ్మద్ నైమ్ (10), మెహిది హసన్ మిరాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, ఫహీమ్ అష్రాఫ్, మొహమ్మద్ నవాజ్ చెరో 2, అహ్మద్ దెనియాల్, సల్మాన్ అఘా, హుసేన్ తలాట్ తలో వికెట్ తీశారు. -
చెత్త రికార్డు మూటగట్టుకున్న పాకిస్తాన్.. జింబాబ్వే కంటే హీనంగా..!
పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. గత రెండు, మూడేళ్లుగా ఆ జట్టు ఏ ఫార్మాట్లోనూ సత్తా చాటలేకపోతుంది. సీనియర్ల ఫామ్ లేమి.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య సత్సంబంధాలు లేకపోవడం వంటి అనేక కారణాల చేత పాక్ జట్టు పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం పసికూనలపై కూడా ఆ జట్టు విజయాలు నమోదు చేయలేకపోతుంది.తాజాగా వారి కంటే చాలా రెట్లు బలహీనమైన బంగ్లాదేశ్ వారికి షాకిచ్చింది. ఆదివారం (జులై 20) ఢాకాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాక్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి సంచలన విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాక్ ఓ ఘోర అప్రతిష్ఠను మూటగట్టుకుంది.2024 నుంచి ఇప్పటివరకు జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ చెత్త రికార్డును పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచే లాగేసుకోవడం విశేషం. ప్రస్తుత క్రికెట్ పసికూనలుగా పిలువబడే జింబాబ్వే, వెస్టిండీస్ కూడా గతేడాది కాలంలో పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి.2024 నుంచి అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) పాకిస్తాన్ 63 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏకంగా 38 మ్యాచ్‌ల్లో ఓడింది. పాకిస్తాన్ తర్వాత అత్యధికంగా బంగ్లాదేశ్ 37 మ్యాచ్‌ల్లో (62లో) పరాజయాలు చవిచూసింది. వెస్టిండీస్ (65 మ్యాచ్‌ల్లో 35లో ఓటమి), జింబాబ్వే (61 మ్యాచ్‌ల్లో 31లో ఓటమి) లాంటి దేశాలు 2024 నుంచి పాకిస్తాన్ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో ఓడాయి. ఈ గణాంకాలు చూస్తే పాక్ క్రికెట్ జట్టు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్దమవుతుంది.పాక్‌ను షాకిచ్చిన బంగ్లాదేశ్మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూల్చింది. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ (4-0-6-2), తస్కిన్ అహ్మద్ (3.3-0-22-3) చెలరేగి బౌలింగ్ చేశారు. తంజిమ్ హసన్ సకీబ్ (4-0-20-1), మెహిది హసన్ (4-0-37-1) కూడా పర్వాలేదనిపించారు. పాక్ బ్యాటర్లలో ఫకర్ జమాన్ (44) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించగా.. ఆఖర్లో అబ్బాస్ అఫ్రిది (22), ఖుష్దిల్ షా (17) రెండంకెల స్కోర్లు చేయడంతో పాకిస్తాన్ అతి కష్టం మీద మూడంకెల స్కోర్ దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో ఆడుతూపాడుతూ విజయం సాధించింది (3 వికెట్లు కోల్పోయి). పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (56 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో రాణించి బంగ్లాను గెలిపించాడు. అతనికి తౌహిద్ హృదోయ్ (36), జాకిర్ అలీ (15 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఢాకా వేదికగానే ఇవాళ (జులై 22) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
BAN vs PAK: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ షాక్
మిర్పూర్: బౌలర్లు విజృంభించడంతో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 (BAN vs PAK)లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 110 పరుగులకే ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అబ్బాస్ అఫ్రిది (22; 3 సిక్స్‌లు), ఖుష్దిల్ షా (17; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (3)తో పాటు సయీమ్ అయూబ్ (6), హరీస్ (4), హసన్ నవాజ్ (0), మొహమ్మద్ నవాజ్ (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టారు. పర్వేజ్ ఫిఫ్టిముఖ్యంగా ముస్తఫిజుర్ పాక్ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పర్వేజ్ హుసేన్ (Parvez Hossain Emon) (39 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా... తౌహిద్ హృదయ్ (37 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2 వికెట్లు పడగొట్టాడు. నాలుగో విజయంటీ20 ఫార్మాట్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ నెగ్గిన మ్యాచ్‌లు. ఇప్పటిదాకా పాక్‌తో 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. 2015, 2016లలో మిర్పూర్‌లోనే జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్... 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చివరిసారి టీ20ల్లో పాక్‌ను ఓడించింది. చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్ బహిష్కరణ -
PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2025 సీజన్ శుక్రవారం (ఏప్రిల్ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ (ISU)- లాహోర్ ఖలందర్స్ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఇస్లామాబాద్ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.అయితే, ఓపెనర్లు ఫఖర్ జమాన్ (1), మహ్మద్ నయీమ్ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్ రజా (23) రాణించాడు.చెలరేగిన జేసన్ హోల్డర్అయితే, డారిల్ మిచెల్ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్ జట్టు ఆలౌట్ అయింది. ఇస్లామాబాద్ బౌలర్లలో పేసర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జేసన్ హోల్డర్ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్, ఇమాద్ వసీం ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ఆండ్రీ గౌస్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపుఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ మున్రో, సల్మాన్ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్ టార్గెట్ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.ఐపీఎల్‌తో ఢీ!కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్ఎల్ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్ 11- మే 18 వరకు షెడ్యూల్ ఖరారు చేసింది. మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఆడే నిమిత్తం పీఎస్ఎల్ నుంచి తప్పుకొన్నారు.చప్పగా సాగిన తొలి మ్యాచ్.. ఇలా అయితే కష్టమే!ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్ఎల్ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. పీఎస్ఎల్ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు. టీ20 క్రికెట్ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.పీఎస్ఎల్-2025: ఇస్లామాబాద్ వర్సెస్ లాహోర్ స్కోర్లులాహోర్: 139 (19.2)ఇస్లామాబాద్: 143/2 (17.4)ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్.చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్.. విదేశీ క్రికెటర్లు వీరే Agha goes BOOM! That’s a clean strike clearing the boundary! 🤩#HBLPSLX l #ApnaXHai l #IUvLQ pic.twitter.com/khDjmxyB57— PakistanSuperLeague (@thePSLt20) April 11, 2025 -
ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమే: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గత కొంతకాలంగా ఇంటా.. బయటా పరాభవాలే ఎదురవుతున్నాయి. తొలుత న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో సొంతగడ్డపై త్రైపాక్షిక సిరీస్‌లో ఓటమిపాలైన పాక్.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ చేదు అనుభవాలు ఎదుర్కొంది.ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ (NZ vs PAK T20 Series)లో చిత్తుగా ఓడిపోయింది. కివీస్‌తో బుధవారం నాటి ఐదో టీ20లో ఓడి.. 4-1తో సిరీస్‌లో పరాజయం పాలైంది.ఒక్క సిరీస్ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్ మాత్రమేఅయితే, ఓటమి అనంతరం పాకిస్తాన్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇలాంటి సిరీస్‌లలో ఓడిపోయినా ఫర్వాలేదని.. తమ దృష్టి మొత్తం ఆసియా కప్, వరల్డ్‌కప్ టోర్నీల మీదనే ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది.సిరీస్ ఆసాంతం వాళ్లు అదరగొట్టారు. అయినా మాకూ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. మూడో టీ20లో హసన్ నవాజ్ అద్భుత శతకం సాధించాడు. ఐదో టీ20లో సూఫియాన్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు.వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాంమేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టి మొత్తం ఆసియా కప్, ప్రపంచకప్లపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్‌లో ఓడినంత మాత్రాన పెద్దగా నిరాశపడాల్సిందేమీ లేదు. ఇక పొట్టి ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు ఏమాత్రం పొంతన ఉండదని తెలిసిందే. వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.అపుడు డకెట్ కూడా ఇలాగేఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా కామెంట్లపై సోషల్ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ డకెట్‌తో పోలుస్తూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్ అయింది. అయితే.. ఈ ఘోర ఓటమి తర్వాత బెన్ డకెట్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సిరీస్‌లలో పరాజయాలు పెద్దగా లెక్కలోకి రావు. మేమే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత దీనిని అందరూ మర్చిపోతారు’’ అని పేర్కొన్నాడు.రెండు జట్లదీ ఒకే పరిస్థితిఅయితే, చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ కనీసం ఒక్క విజయం కూడా సాధించలేదు. అఫ్గనిస్తాన్ చేతిలోనూ చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు సల్మాన్ ఆఘా తమ ఫోకస్ ఆసియా కప్, వరల్డ్‌కప్ మాత్రమే అని చెప్పడం గమనార్హం. అన్నట్లు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తొలుత న్యూజిలాండ్.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల.. ఆ మ్యాచ్ రద్దైంది. దీంతో ఇంగ్లండ్ మాదిరే ఒక్క గెలుపు లేకుండానే పాకిస్తాన్ ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.చదవండి: NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమిపాక్తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ -
NZ vs Pak: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి
పాకిస్తాన్‌తో ఐదో టీ20లో న్యూజిలాండ్ (New Zealand Vs Pakistan) క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి.. 4-1తో సిరీస్ ముగించింది. ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించి సల్మాన్ ఆఘా బృందానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కేవలం పది ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకుంది.మళ్లీ పాత కథేకాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (Pakistan Tour Of New Zealand)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మార్చి 16న టీ20 సిరీస్ మొదలుకాగా.. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్ గెలుపొందింది. అయితే, మూడో టీ20లో పాక్ అనూహ్య సంచలన విజయం సాధించింది.. ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది.కానీ తర్వాత మళ్లీ పాత కథే. నాలుగో టీ20లో కివీస్ చేతిలో ఏకంగా 115 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిన పాక్.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో ఐదో టీ20లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించగా భంగపాటే ఎదురైంది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.సల్మాన్ ఆఘా కెప్టెన్ ఇన్నింగ్స్ టాపార్డర్‌లో ఓపెనర్లు మహ్మద్ హారిస్ (11), హసన్ నవాజ్ (0).. వన్‌డౌన్ బ్యాటర్ ఒమర్ యూసఫ్ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సల్మాన్ ఆఘా (Salman Agha) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. అయితే, అతడికి మిగతా వారి నుంచి సహకారం అందలేదు.ఆఖర్లో షాదాబ్ ఖాన్ 20 బంతుల్లో 28 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ ఐదు వికెట్లు(5/22) కూల్చి పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో జేకబ్ డఫీ రెండు, బెన్ సీర్స్, ఇష్ సోధి ఒక్కో వికెట్ పడగొట్టారు.38 బంతుల్లోనే 97 రన్స్ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ పది ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఏకంగా పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సాయంతో 38 బంతుల్లోనే 97 రన్స్‌తో అజేయంగా నిలిచాడు.మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. మార్క్ చాప్మన్(3) మాత్రం నిరాశపరిచాడు. ఏదేమైనా టిమ్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా మరో పది ఓవర్లు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. టిమ్ సీఫర్ట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ఆసాంతం అద్బుతంగా ఆడిన జేమ్స్ నీషమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్ -
అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? : పాక్ మాజీ క్రికెటర్ ఆగ్రహం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) మండిపడ్డాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఎప్పుడో చేతులెత్తేసిందని.. కేవలం సొంతవాళ్లకు జీతాలు ఇచ్చుకునేందుకు ఇదొక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆరోపించాడు.గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికా జట్లతో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ వైఫల్యం చెందింది.ఈ మెగా వన్డే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది.ఈ క్రమంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజంలపై వేటు వేసిన పీసీబీ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి వారిని పక్కనపెట్టింది. టీ20 కొత్త కెప్టెన్‌గా సల్మాన్ ఆఘాకు బాధ్యతలు అప్పగించింది. 91 పరుగులకే ఆలౌట్ .. ఘోర ఓటమిఅయితే, కివీస్ దేశ పర్యటనలో భాగంగా తొలి టీ20లో పాకిస్తాన్ అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలుత 91 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో కివీస్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది.పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఫలితంగా పాక్ టీ20 చరిత్రలో ఇదో ఘోర ఓటమి(59 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి టార్గెట్ ఛేదించడం)గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పీసీబీ సెలక్షన్ కమిటీ తీరును తూర్పారబట్టాడు.అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు? ‘‘అసలు షాదాబ్‌ను ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకున్నారు. అతడి ప్రదర్శన గత కొంతకాలంగా ఎలా ఉందో మీకు తెలియదా? అతడిని జట్టులోకి తీసుకువచ్చింది ఎవరు? ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడండి. షాదాబ్ విషయంలో పీసీబీ ప్రణాళికలే వేరు. అతడిని ఎందుకు ఎంపిక చేశారన్నది కొద్దిరోజుల్లోనే బయటపడుతుంది.అయినా.. కివీస్‌తో తొలి టీ20లో మా బౌలర్లు అసలు ఏం చేశారు? మాట్లాడితే సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు అంటారు. కానీ వాళ్లలో ఒక్కరైనా బాధ్యతగా ఆడారా? అసలు ప్రత్యర్థిని కాస్తైనా భయపెట్టగలిగారా? ఇంతకంటే చెత్త ఓటమి మరొకటి ఉంటుందా?’’ అని షెహజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా కివీస్‌తో తొలి టీ20లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం 3 పరుగులే చేశాడు. అదే విధంగా.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో పద్దెమినిది పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు?ఇక NCA గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీ ఆటగాళ్ల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇక్కడి నుంచే మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చేవారు. నేను.. మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, ఉమర్ అమీన్, షాన్ మసూద్ వచ్చాం. మేము ఎన్సీఏలో ఉన్నప్పుడు వివిధ రకాల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ముదాస్సర్ నజర్ వంటి కోచ్‌లు ఉండేవారు.కానీ గత నాలుగేళ్లుగా ఎన్సీఏ ఏం చేస్తోంది? ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్ల అభివృద్ధికి దోహదం చేయాల్సింది పోయి.. సొంతవాళ్లకు జీతాలు ఇచ్చేందుకు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఎన్సీఏ చీఫ్ నదీమ్ ఖాన్ ఏం చేస్తున్నారు.ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? జవాబుదారీతనం ఉందా? ప్రతిసారీ ఆటగాళ్లను ఓటములకు బాధ్యులను చేయడం సరికాదు. నదీమ్ ఖాన్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎన్సీఏ లాంటి కీలకమైన వ్యవస్థను నీరుగారుస్తుంటే ఎవరూ మాట్లాడరే? అసలు ఆయనను ఏ ప్రాతిపదికన అక్కడ నియమించారు? ఇందుకు అతడికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలు ఏమిటి? అసలు పీసీబీ ఏం చేస్తోంది?’’ అని అహ్మద్ షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: IPL 2025: 18వ సారైనా... బెంగళూరు రాత మారేనా! -
తీరు మారని పాకిస్తాన్.. 91 పరుగులకే ఆలౌట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పేలవ ప్రదర్శనతో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఏ మాత్రం మారలేదు. క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి 18.4 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. కైల్ జేమిసన్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ అగా సల్మాన్(18)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్.. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే టీ20 సిరీస్‌కు మాత్రం కీలక ఆటగాళ్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజాంలను టీ20 జట్టు నుంచి పాకిస్తాన్ సెలక్టర్లు తప్పించారు. మహ్మద్ రిజ్వాన్ స్ధానంలో సల్మాన్ అలీ అగాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ వన్డేల్లో మాత్రం రిజ్వాన్‌ను కెప్టెన్‌గా పీసీబీ కొనసాగించింది.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీపాకిస్తాన్: హారీస్ (వికెట్ కీపర్), హసన్ నవాజ్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఖుష్దిల్ షా, జహందాద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్చదవండి: WPL 2025: ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే? -
NZ vs PAK: రిజ్వాన్, బాబర్‌లపై వేటు.. పాక్ కొత్త కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్
న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) తమ జట్లను ప్రకటించింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan), మాజీ సారథి బాబర్ ఆజం(Babar Azam)లకు ఈ సందర్భంగా షాకిచ్చింది. టీ20 జట్టు నుంచి వీరిద్దరిని తప్పించిన యాజమాన్యం వన్డేల్లో మాత్రం చోటిచ్చింది.పాయింట్ల పట్టికలో అట్టడుగునఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుగా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన రిజ్వాన్ బృందం.. గ్రూప్ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. అనంతరం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో మరోసారి పరాజయాన్ని చవిచూసింది.అనంతరం ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా.. వర్షం అడ్డుపడింది. రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వరణుడి కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఒక్క విజయం కూడా లేకుండానే పాకిస్తాన్ టోర్నీని ముగించింది. పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురైంది.ఈ టోర్నీలో కెప్టెన్ రిజ్వాన్‌తో పాటు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై మాజీ క్రికెటర్లు వసీం అక్రం, షోయబ్ అక్తర్ తదితరులు విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంద.న్యూజిలాండ్ పర్యటనకుకాగా చాంపియన్స్ ట్రోఫీలో చేదు అనుభవం తర్వాత పాకిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. మార్చి 16- ఏప్రిల్ 5 వరకు కొనసాగనున్న పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు జట్లను పీసీబీ మంగళవారం ప్రకటించింది. వన్డే సారథిగా రిజ్వాన్‌ను కొనసాగించడంతో పాటు ఆ జట్టులో బాబర్‌కు కూడా సెలక్టర్లు చోటిచ్చారు.అయితే, టీ20లకు మాత్రం పీసీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకువచ్చింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సల్మాన్ ఆఘాను పాక్ టీ20 జట్టు సారథిగా నియమించింది. ఈ క్రమంలో రిజ్వాన్, బాబర్‌లపై వేటు వేసింది. ఆకిబ్ కొనసాగింపుఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ ఆకిబ్ జావెద్‌పై కూడా వేటు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా కివీస్ టూర్‌కు మాత్రం పాకిస్తాన్ అతడినే కొనసాగించింది.కొత్తగా మహ్మద్ యూసఫ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించిన పీసీబీ.. నవీద్ అక్రం చీమాను టీమ్ మేనేజర్‌గా.. అజర్ మహమూద్‌ను అసిస్టెంట్ కోచ్‌గా సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. ఇదిలా ఉంటే.. ఈ టూర్‌కు గాయాల వల్ల ఓపెనర్లు ఫఖర్ జమాన్, సయీమ్ ఆయుబ్ దూరం కాగా ఆకిఫ్ జావేద్, మహ్మద్ అలీలకు వన్డే జట్టులో స్థానం దక్కింది.కాగా న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో ఐదు టీ20లు.. మార్చి 29, ఏప్రిల్ 2, 5 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.న్యూజిలాండ్‌తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్ జావేద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సూఫియాన్ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.న్యూజిలాండ్‌తో టీ20లకు పాకిస్తాన్ జట్టుసల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, ముహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, ముహమ్మద్ అలీ, ముహమ్మద్ హారీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, షాహీన్ షా అఫ్రిది, సూఫియాన్ ముఖీమ్, ఉస్మాన్ ఖాన్.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!