ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్‌ గెలుపు | Salman Agha, Haris Ruaf star as Pakistan edge Sri Lanka by six runs in first ODI | Sakshi
Sakshi News home page

PAK vs SL: ఉత్కంఠ పోరు.. శ్రీలంకపై పాకిస్తాన్‌ గెలుపు

Nov 12 2025 7:40 AM | Updated on Nov 12 2025 7:47 AM

Salman Agha, Haris Ruaf star as Pakistan edge Sri Lanka by six runs in first ODI

శ్రీలంక‌తో మూడు వన్డేల‌ సిరీస్‌లో పాకిస్తాన్‌ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్‌ 6 పరుగుల తేడాతో లంక‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

టాప్‌–4 బ్యాటర్లలో ఫఖర్‌ జమాన్‌ (55 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (51 బంతుల్లో 29; 3 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఆయూబ్‌ (6), రిజ్వాన్‌ (5) విఫలమయ్యారు. 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్‌ను సల్మాన్‌ ఆగా (87 బంతుల్లో 105 నాటౌట్‌; 9 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు.

హుస్సేన్‌ తలత్‌ (63 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. సల్మాన్, హుస్సేన్‌ ఇద్దరు ఐదో వికెట్‌కు 138 పరుగులు చేశారు. లంక‌ స్పిన్నర్‌ హసరంగ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కష్టసాధ్యమైన 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు కడదాకా పోరాడిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 293 పరుగులు చేసి ఓడింది. 

హసరంగ (52 బంతుల్లో 59; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నంత సేపు గెలుపుపై ఆశలు రేపాడు. సమరవిక్రమ (39; 6 ఫోర్లు), కమిల్‌ మిషార (38; 5 ఫోర్లు, 1 సిక్స్‌), అసలంక (32; 2 ఫోర్లు) ఫర్వాలేదనపించారు. రవూఫ్‌ 4, నసీమ్‌ షా, అష్రఫ్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే రావ‌ల్పిండి వేదిక‌గానే గురువారం(నవంబ‌ర్ 13) జ‌ర‌గ‌నుంది.
చదవండి: IPL 2026 Auction: ఆరోజే ఐపీఎల్‌ వేలం.. వేదిక ఖరారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement