మహేశ్ బాబు కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా 'మురారి'.
ఈ చిత్ర క్లైమాక్స్ ఎలా తీశామనే విషయాన్ని దర్శకుడు కృష్ణవంశీ తాజాగా వెల్లడించారు.
మురారి అని కాకుండా మహేశ్ పేరు మీదే మూడు గంటల పాటు నిష్టగా ఈ హోమం జరిగిందని చెప్పారు.
ఆ హోమం జరుగుతుండగా.. మధ్యలో అక్కడక్కడా కొన్ని షాట్స్ తీశామని అన్నారు.
ఆ ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకున్నారు.


