భారత పురుషల క్రికెట్ జట్టు.. కొత్త ఏడాదిని సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కివీస్-భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో నాలుగైదు రోజుల్లో వన్డే జట్టును కూడా ఖరారు చేయనుంది.
టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు దూరమైన గిల్.. తిరిగి టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ గాయపడడంతో సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే గిల్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో కివీస్‌తో వన్డే సిరీస్‌లో జట్టును గిల్ నడిపించనున్నాడు.
శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ?
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ భారత మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ కూడి తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్నాడు.
అతడు తన ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాడు. అతడికి రెండు మూడు రోజుల్లో ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. అందులో అతడు ఉత్తీర్ణ సాధిస్తే కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక కానున్నాడు.
పడిక్కల్‌కు చోటు..!
ఒకవేళ అయ్యర్ ఫిట్‌నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పడిక్కల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ-2025లో పడిక్కల్ దుమ్ములేపుతున్నాడు.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో పడిక్కల్ సగటు దాదాపు 83. 64గా ఉంది. దీంతో అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా కివీస్‌తో వన్డేలకు స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.
న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)/ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్


