పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు | Ranji Trophy Semis 2026: Karnataka Scores 736 in 1st Innings Vs UTK | Sakshi
Sakshi News home page

పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు

Feb 17 2026 10:55 AM | Updated on Feb 17 2026 11:34 AM

Ranji Trophy Semis 2026: Karnataka Scores 736 in 1st Innings Vs UTK

రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో కర్ణాటక అతి భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్‌ బౌలింగ్‌ను చితక్కొట్టి తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 736 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (141), స్మరణ్‌ రవిచంద్రన్‌ (135) భారీ శతకాలతో మెరవగా.. కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ డబుల్‌ సెంచరీ (232)తో కదం తొక్కాడు.

736 పరుగులు
మిగిలిన వారిలో కరుణ్‌ నాయర్‌ (60), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కృతిక్‌ కృష్ణ (60), విద్యాధర్‌ పాటిల్‌ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 194.4 ఓవర్లలో 736 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

అయితే, ఈ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (5)  విఫలం కాగా.. శ్రేయస్‌ గోపాల్‌ (0), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (0) డకౌట్‌ అయ్యారు. శిఖర్‌ శెట్టి 12 పరుగులు చేయగా.. ప్రసిద్‌ కృష్ణ ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు.

ఇక ఉత్తరాఖండ్‌ బౌలర్లలో ఆదిత్య రావత్‌ నాలుగు వికెట్లు తీయగా.. మయాంక్‌ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వారిలో అభయ్‌ నేగి, అన్వీశ్‌ సుధా, లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

రెండో రోజు ఆట సాగిందిలా..
కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (232; 29 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీ... స్మరణ్‌ (121 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అజేయ శతకం... వెరసి ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 355/2తో సోమవారం నాటి రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక... ఆట ముగిసే సమయానికి 180 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 689 పరుగులు సాధించింది.

కరుణ్‌ నాయర్‌ (60; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి పడిక్కల్‌ మూడో వికెట్‌కు 129 పరుగులు ... స్మరణ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 59 పరుగులు జత చేశాడు.  

శ్రేయస్‌ గోపాల్‌ (0) డకౌట్‌కాగా ... కృతిక్‌ కృష్ణ ( 60; 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి స్మరణ్‌ ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మరణ్‌ కెరీర్‌లో ఐదో ఫస్ట్‌క్లాస్‌ సెంచరీ సాధించాడు. కృతిక్‌ వెనుదిరిగాక ... విద్యాధర్‌ పాటిల్‌ (35 బ్యాటింగ్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), స్మరణ్‌ మరో వికెట్‌ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. 

చదవండి: T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక‌.. ఇక లగేజి స‌ర్దుకోవ‌డ‌మే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement