పోరాడి ఓడిన కరణ్‌ సింగ్‌ | Delhi Open ATP Challenger-75 tennis tournament | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన కరణ్‌ సింగ్‌

Feb 17 2026 8:38 AM | Updated on Feb 17 2026 9:34 AM

Delhi Open ATP Challenger-75 tennis tournament

ఢిల్లీ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తొలి రోజు భారత క్రీడాకారుడు కరణ్‌ సింగ్‌కు నిరాశ ఎదురైంది. ‘వైల్డ్‌ కార్డు’తో నేరుగా  సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో బరిలోకి దిగిన కరణ్‌ ఈ అడ్డంకిని దాటలేకపోయాడు. ఢిల్లీ లాన్‌ టెన్నిస్‌ సంఘం (డీఎల్‌టీఏ) కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 436వ ర్యాంకర్‌ కరణ్‌ సింగ్‌ 6–4, 6–7 (5/7), 3–6తో ప్రపంచ 260వ ర్యాంకర్‌ డేనియల్‌ మైకెల్‌స్కీ (పోలాండ్‌) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 

2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కరణ్‌ ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రామ్‌కుమార్‌ రామనాథన్‌ 2–6, 2–6తో హైయోన్‌ చుంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోగా... మనీశ్‌ సురేశ్‌ కుమార్‌ 6–3, 7–5తో యుసుంగ్‌ పార్క్‌ (దక్షిణ కొరియా)పై గెలిచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు. మెయిన్‌ ‘డ్రా’లో భారత్‌ నుంచి సుమిత్‌ నగాల్, దిగ్విజయ్‌ ప్రతాప్‌ సింగ్, మానస్‌ ధామ్నె బరిలో ఉన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement