breaking news
Delhi Open tennis
-
పోరాడి ఓడిన కరణ్ సింగ్
ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నమెంట్లో తొలి రోజు భారత క్రీడాకారుడు కరణ్ సింగ్‌కు నిరాశ ఎదురైంది. ‘వైల్డ్ కార్డు’తో నేరుగా సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో బరిలోకి దిగిన కరణ్ ఈ అడ్డంకిని దాటలేకపోయాడు. ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 436వ ర్యాంకర్ కరణ్ సింగ్ 6–4, 6–7 (5/7), 3–6తో ప్రపంచ 260వ ర్యాంకర్ డేనియల్ మైకెల్స్కీ (పోలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 28 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కరణ్ ఏడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. రామ్‌కుమార్ రామనాథన్ 2–6, 2–6తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోగా... మనీశ్ సురేశ్ కుమార్ 6–3, 7–5తో యుసుంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి సుమిత్ నగాల్, దిగ్విజయ్ ప్రతాప్ సింగ్, మానస్ ధామ్నె బరిలో ఉన్నారు. -
క్వార్టర్ ఫైనల్లో సోమ్‌దేవ్
న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక్కడి ఆర్కే ఖన్నా స్టేడియంలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు వరుస సెట్లలో డి వూ (చైనా)పై విజయం సాధించాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ అయిన సోమ్‌దేవ్ 6-2, 6-2తో ప్రపంచ 212 ర్యాంకర్ డి వూపై అలవోక విజయం సాధించాడు. 62 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఇద్దరి మధ్య ఇదే తొలి పోరు కాగా... రెండు సెట్లలోనూ భారత స్టార్ విజృంభించడంతో చైనా ఆటగాడు చేతులెత్తేశాడు. తన ఆటతీరుపై సోమ్‌దేవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘వూ అషామాషీ ప్రత్యర్థి కాదు. కానీ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురవలేదు. మొత్తం మీద సునాయాసంగా ముందంజ వేయడం ఆనందంగా ఉంది. కోర్టు కూడా నా ఆటతీరుకు బాగా సరిపోయింది. ఇంకా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని సోమ్‌దేవ్ పేర్కొన్నాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జోడి 6-3, 5-7, 11-9తో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.


