నేడు కాంగ్రెస్‌ చలో లోక్‌భవన్‌ | Telangana congress chalo lok bhavan Program Updates | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్‌ చలో లోక్‌భవన్‌

Jul 22 2026 7:22 AM | Updated on Jul 22 2026 7:22 AM

Telangana congress chalo lok bhavan Program Updates

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ నేడు చలో లోక్‌భవన్‌ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతలు లోక్‌భవన్ వెళ్లనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి లోక్‌భవన్ వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనున్నారు. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అలాగే, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement