ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా కారణాలతో ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా కీలక మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జన్‌పథ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లే ముందు మెట్రో సేవలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. భద్రతా పరిస్థితుల ఆధారంగా స్టేషన్ల పునఃప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని DMRC వెల్లడించింది.
Delhi Metro stations -Lok Kalyan Marg, Rajiv Chowk, Patel Chowk, Ramakrishna Ashram Marg, Barakhambha Road, Supreme Court, Seva Teerth, Janpath, Mandi House, Central Secretariat, ITO, Delhi Gate, Indraprastha, Khan Market, Jor Bagh and Shivaji Stadium are closed till further… pic.twitter.com/PXLPuJTP2r
— ANI (@ANI) July 22, 2026


