
కోల్‌కతా: భారత వెటరన్ సీమర్ మొహమ్మద్ షమీ దేశవాళీ క్రికెట్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా టీమిండియాకు ఎంపికవ్వాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఈ సీనియర్ పేసర్ ఈ సీజన్ ఐపీఎల్ తర్వాత మళ్లీ బరిలోకే దిగలేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టుకు దూరమైన షమీ త్వరలోనే మొదలయ్యే దేశవాళీ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు.
దీర్ఘకాలంగా వేధించిన చీలమండ గాయం నుంచి కోలుకుని ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడిన షమీ ఆ టోరీ్నలో 9 వికెట్లతో రాణించాడు. ఈ మెగా టోరీ్నలో రోహిత్ నేతృత్వంలోని టీమిండియా విజేతగా నిలిచింది. అయితే తదుపరి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగినప్పటికీ కేవలం 6 వికెట్లే పడగొట్టాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దీనిపై సంతృప్తి చెందని సెలక్టర్లు ఆసీస్ టూర్‌కు అతన్ని పక్కన బెట్టారు. అయితే బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) శనివారం ప్రకటించిన 50 మంది సభ్యులు గల ప్రాబబుల్స్‌లో అతనే ప్రధాన ఆటగాడిగా ఉన్నాడు.
బెంగాల్‌తో పాటు దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ తరఫున కూడా బరిలోకి దిగేందుకు షమీ ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ ఏడాది నుంచి మళ్లీ ఇంటర్–జోనల్ పాత పద్ధతిలోనే నిర్వహించే దులీప్ ట్రోఫీ వచ్చే నెల 28 నుంచి జరుగుతుంది. షమీతో పాటు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పేసర్ ఆకాశ్ దీప్, బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌లు కూడా బెంగాల్ జంబో ప్రాబబుల్స్‌లో ఉన్నారు. పేసర్ ముకేశ్ కుమార్, బెంగాల్ కెప్టెన్ అనుస్తుప్ మజుందార్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షహబాజ్ అహ్మద్, వికెట్ కీపర్–బ్యాటర్ అభిõÙక్ పొరెల్ ప్రాబబుల్స్ జాబితాకు ఎంపికయ్యారు.