గాయంతో వైదొలిగిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Indian Duo Withdraw from Swiss Open After Satwik Shoulder Injury | Sakshi
Sakshi News home page

గాయంతో వైదొలిగిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Mar 14 2026 4:32 AM | Updated on Mar 14 2026 4:32 AM

Indian Duo Withdraw from Swiss Open After Satwik Shoulder Injury

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత కథ ముగిసింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి ద్వయం బరిలోకి దిగకుండానే ప్రత్యర్థి జంట క్రిస్టియన్‌ జార్‌–రస్‌ముస్‌ జార్‌కు వాకోవర్‌ ఇచ్చింది. సాత్విక్‌ సాయిరాజ్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సాత్విక్‌ది పాత గాయమే.

ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి కనీసం వారం రోజులు పడుతుంది’ అని భారత జోడీకి కోచ్‌గా ఉన్న టాన్‌ కిమ్‌ హెర్‌ (మలేసియా) తెలిపాడు. సాత్విక్‌–చిరాగ్‌ నిష్క్రమణతో ఈ టోర్నీలో భారత్‌ నుంచి తరుణ్‌ మన్నేపల్లి మాత్రమే బరిలో ఉన్నాడు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 51వ  ర్యాంకర్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో హైదరాబాద్‌ ప్లేయర్‌ తరుణ్‌ తలపడతాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement