ఐసీసీ ప్రపంచకప్‌ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్‌... కెప్టెన్‌గా మార్క్‌రమ్‌ | ICC T20 World Cup: Sanju Samson and Hardik Pandya and Ishan Kishan and Jasprit Bumrah in team of the tournament | Sakshi
Sakshi News home page

ఐసీసీ ప్రపంచకప్‌ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్‌... కెప్టెన్‌గా మార్క్‌రమ్‌

Mar 10 2026 4:13 AM | Updated on Mar 10 2026 4:13 AM

ICC T20 World Cup: Sanju Samson and Hardik Pandya and Ishan Kishan and Jasprit Bumrah in team of the tournament

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్‌ జట్టులో టైటిల్‌ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్‌రమ్‌ (దక్షిణాఫ్రికా) కెపె్టన్‌ కాగా, ఓపెనింగ్‌లో సంజూ సామ్సన్, టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్, మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్యా, బౌలింగ్‌లో పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్‌ నుంచి టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ ఈ ఐసీసీ టీమ్‌లో ఓపెనర్‌గా ఉన్నాడు.

చిత్రంగా రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్‌ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్‌ జట్టు: మార్క్‌రమ్‌ (కెపె్టన్‌), ఫర్హాన్‌ (పాకిస్తాన్‌), సామ్సన్, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా (భారత్‌), విల్‌ జాక్స్, ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌), జేసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌), ఎన్‌గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్‌ షాలి్వక్‌ (అమెరికా; 12వ ప్లేయర్‌).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement